Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"...డాష్ డాష్" చూస్తే తీర్థను తెగ మెచ్చుకుంటారట!

Advertiesment
తీర్థ
, మంగళవారం, 10 ఏప్రియల్ 2012 (10:04 IST)
File
FILE
దర్శకుడు తేజ తన తాజా చిత్రం 'నీకు నాకు డాష్‌ డాష్‌' చిత్రంలో దాదాపు 42 మంది కొత్తవారిని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. లిక్కర్‌ మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ కీలక పాత్ర ఉంది. అదే లేడీ డాన్‌. ఈ పాత్రలో తీర్థ నటిస్తోంది.

లిక్కర్‌ మాఫియాతో లింకులున్న పాత్రను ఆమె పోషించింది... అనేకంటే... రక్తికట్టించిందని చెప్పొచ్చంటున్నారు తేజ. చీరకట్టులోనైనా.. పైకి ఎగదోసి.. నోటిలో గుట్కాను నములుతూ.. తుపుక్‌ తుపుక్‌ మంటూ.. ఊస్తూ.... పక్కా హైదరాబాద్‌ యాసతో మాట్లాడితే.. ఆమె నటనకు దర్శకుడు తేజ డంగైపోయాడట. ఆమె నటన ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుందంటున్నాడు. తీర్థ అనే నటిని అందరూ తెగ మెచ్చుకుంటారని తెలియజేస్తున్నారు.

గతంలో తీర్థ.. 'సొంత ఊరు' అనే సినిమాలో నటించింది. పాత్ర రీత్యా వేశ్యగా చేసింది. ఆ చిత్రానికి అవార్డు కూడా వచ్చింది. నంది అవార్డు వచ్చిన చిత్రానికి పని చేసింది కాబట్టి ఆమెను సెట్లో అందరూ బాగానే చూశారు. సినిమా రంగానికి పూర్వం మోడల్‌గా చేసేది. అవి చూశాక దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి 'సొంత ఊరు'లో అవకాశం కల్పించాడు. కాగా 'నీకూ నాకూ డాష్ డాష్' చిత్రం 12న విడుదలకు సిద్ధమైంది. ఆ తర్వాత ఈమె ఫేట్‌ ఏ మేరకు మారుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu