శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మికి భారీ డిమాండ్
, గురువారం, 22 మార్చి 2012 (20:23 IST)
టాలీవుడ్ హీరోల కుమార్తెలు సినిమాల్లో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు కృష్ణగారి కుమార్తె ఒకటిరెండు చిత్రాల్లో నటించింది. కానీ తర్వాత నటించలేదు. కమల్‌హాసన్ కుమార్తె శృతి నటిస్తూనే ఉంది. లేటెస్ట్‌గా శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి నటించడానికి సిద్ధమైంది. ఆమె బాడీ లాంగ్వేజ్ బాగా నచ్చడంతో ఇప్పటికే టాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చేస్తున్నాయి. నాగార్జున తనయుడు నాగచైతన్య నటించనున్న 'గౌరవం' చిత్రం ద్వారా ఆమె పరిచయం కానుంది. యుటీవీ పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి ముందుకు వచ్చింది. 'గగనం' ఫేమ్ రాధామోహన్ దర్శకుడు. ఇటీవలే ఆమె ఫొటో సెషన్ చూశాక.. మరో ఇద్దరు యువ కథానాయకులు తమ చిత్రాల్లో బుక్ చేయమని నిర్మాతకు ఆఫర్ చేశారు. మొత్తమ్మీద వరలక్ష్మికి ఆఫర్ల వరద రావడంపై చాలా ఆనందంగా ఉంది.