Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జునతో నయనతార... పారితోషికం రూ. 1.5 కోట్లు..?!!

Advertiesment
నయనతార
, మంగళవారం, 13 మార్చి 2012 (12:14 IST)
ప్రభుదేవాతో ప్రేమాయణం సాగిస్తున్నప్పుడు సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తున్నట్లు తేల్చిన నయనతార హఠాత్తుగా ఒక తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపింది. ఈ సినిమాకు ఆమెకు 1.5 కోట్ల రూపాయల పారితోషికం ముట్టజెప్పినట్లు సమాచారం. నిజానికి "శ్రీరామరాజ్యం" చిత్రమే ఆమె చివరి చిత్రమని అనుకున్నారు.

ఆ చిత్రం చివరి రోజు షూటింగ్ పూర్తయిన తర్వాత ఇచ్చిన పార్టీలో ఆమె కన్నీరు పెట్టుకుంది. ఇదిలా ఉండగా, ఈ విషయమై ప్రభుదేవా, నయనతారల మధ్య గొడవ జరిగింది. సినిమాలు వదిలేస్తున్నందుకు ఎందుకంత ఏడుపు అని ప్రభుదేవా పదేపదే నయనను ప్రశ్నించడంతో విసుగు చెందిన నయన అతడిని వదిలేసి మళ్లీ కెరీర్లో దూసుకుపోవాలని నిర్ణయించుకున్నదట.

ఇందులో భాగంగా దశరథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నాగార్జున సరసన నటించేందుకు నయనతార అంగీకరించింది.
అందుకుగాను ఆమెకు కోటిన్నర పారితోషికం ఇచ్చినట్లు భోగట్టా. ఇక నటించనని నటనకు గుడ్‌బై చెప్పి వెళ్ళిపోయిన నయనతారను తిరిగి పిలిచి ఇంత పెద్ద మొత్తాన్ని పారితోషికంగా ఇవ్వడం చిత్ర పరిశ్రమలో ఎంతో మందిని విస్మయానికి గురిచేస్తోందట. దీనిపై సెక్సీ భామలు, ముదురు ముద్దుగుమ్మలు గుస్సాగా ఉన్నారట.

Share this Story:

Follow Webdunia telugu