Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"మదన్మోహిని" సోనా టాలీవుడ్ టాప్ లేపుతుందట

Advertiesment
సోనా
, శనివారం, 29 అక్టోబరు 2011 (14:48 IST)
ఇటీవల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ తనను లైంగికంగా వేధించాడంటూ కేసు పెట్టి పాపులర్ అయిన హాటెస్ట్ తార సోనా. ఇపుడీ వయ్యారిభామ నటించిన మదన్మోహిని చిత్రం తెలుగు తెరపైకి దూసుక రానుంది. 

పాపులారిటీ, పబ్లిసిటీ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చెప్పినట్లు... సోనా పాపులారిటీని సదరు నిర్మాత క్యాష్ చేసుకోనున్నాడు. సోనా ఇంతకుముందే నటించిన ఈ సినిమాను డబ్ చేసి టాలీవుడ్ పైకి వదులుతున్నారు.

కాగా ఈ సినిమా చూసిన తర్వాత సోనాకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తడం ఖాయమంటున్నారు. అందాలను ఎంతవరకు చూపించాలో అంతవరకూ చూపించేసిందనీ, ఇంకా చూపించేందుకైనా సోనా వెనుకాడదు కనుక ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయంటున్నారు. మరి టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఏం చేస్తారో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu