దగ్గుబాటి రానా చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ ఏదో రకంగా వివాదాల్లో ఉంటూనే ఉన్నాడన్నది టాలీవుడ్ టాక్. పబ్‌ల చుట్టూ తిరుగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడని ఆమధ్య ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు కూడా వచ్చాయి.
అంతేకాదు ఆమధ్య శ్రియ, త్రిష అంటూ ఆయనతో వీరి పేర్లు బయటకు వచ్చాయి. హిందీ చిత్రంలో నటిస్తున్న సమయంలో బిపాసాబసుతో కూడా ఎఫైర్ సాగించాడని మరో టాక్ ఉంది. తాజాగా రానా మధుశాలినితో క్లోజ్‌గా ఉంటున్నాడని పరిశ్రమవర్గాలు చెప్పుకుంటున్నాయి.
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న డిపార్ట్‌మెంట్ చిత్రంలో రానా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్, సంజయ్‌దత్, రానా గ్యాంగ్‌తో పాటు ఓ అమ్మాయి ఉంటుంది. ఆ పాత్రకు మధుశాలిని కరెక్ట్‌గా సరిపోతుందనీ, తమిళంలో వాడు-వీడు చిత్రంలో సూపర్బ్‌గా నటించిందని రికమండేషన్ చేసినట్లు తెలిసింది.