Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకేం బెంగలేదు.. మీకుంటే చెప్పండి... తీరుస్తా: శ్రియ

Advertiesment
శ్రియ
, మంగళవారం, 18 అక్టోబరు 2011 (14:36 IST)
File
FILE
ఒకప్పుడు నటి శ్రియ దక్షిణాది భాషల్లో టాప్‌లో ఉండేది. రానురాను కొత్త నీరు రావడంతో పాత నీరు వెనక్కువెళ్ళినట్లు ఈ ముద్దుగుమ్మకు సినిమాలు తగ్గిపోయాయి. అదేసమయంలో బాలీవుడ్‌లో కాలుపెట్టి.. అడపాదడపా నటిస్తోంది.

ఈ విషయంపై అక్కడివారు ప్రస్తావిస్తే... నాకేం బెంగలేదు. మీకుంటే చెప్పండని.. నవ్వుతూ చెప్పింది. పైగా రేపటి గురించి ఆలోచించను. ఇవాళేం జరుగుతుందో చాలు. నాకు సినిమాలు తగ్గాయనేది మీ ఆలోచనే. కానీ నేను యాడ్స్‌లో చేస్తున్నాను. చాలా సుఖంగా ఉంది.

సినిమాలైతే రోజుల తరబడి తెమలదు. యాడ్స్‌ అయితే ఇట్టే గడిసిపోతుంది. డబ్బుకు డబ్బు వస్తుంది. కానీ.. నాకు లైఫ్‌ ఇచ్చింది సినిమాయేనే. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏదైనా గ్యాప్‌వస్తే.. ఏవో కారణాలుంటాయి. అవన్నీ చెప్పేవికావు. మాకూ విశ్రాంతి కావాలి కదా. అంటూ క్లాస్‌ పీకింది.

Share this Story:

Follow Webdunia telugu