Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంప్రదాయ దుస్తులు లేక పోటీకి వాసుకీ దూరం!!!

Advertiesment
బ్రెజిల్ కస్టమ్స్
, మంగళవారం, 13 సెప్టెంబరు 2011 (10:35 IST)
File
FILE
బ్రెజిల్ కస్టమ్స్ అధికారులు పుణ్యమాని విశ్వసుందరి పోటీల నుంచి తెలుగమ్మాయి నిష్క్రమించింది. దీంతో విశ్వసుందరి కిరీటంపై ఉన్న ఆశలు కోట్లాదిమంది భారతీయులు వదులుకున్నారు.

బ్రెజిల్ జరిగే విశ్వసుందరి పోటీలకు భారత్ తరపున తెలుగమ్మాయి సుంకవల్లి వాసుకీ బయలుదేరిన విషయం తెల్సిందే. అయితే, భారతదేశ సంస్కృతిని ప్రతిబింభించే వస్త్రాల ప్రదర్శనలో ఆమె విఫలకావడమే ఇందుకు కారణం.

విశ్వసుందరి పోటీల్లో భాగంగా మూడు రోజుల క్రితం నిర్వహించిన "సంప్రదాయ దుస్తుల" ఫొటో సెషన్స్‌కు ఆమె దూరమయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. విమానాశ్రయంలో వాసుకీ లగేజీని బ్రెజిల్ కస్టమ్స్ అధికారులు తనిఖీ నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల పాటు తమ వద్దే ఉంచుకున్నారు.

ఫలితంగా ఫొటో సెషన్‌లో పాల్గొనలేకపోయినట్టు వాసుకీ తన ట్విట్టర్‌ బ్లాగులో పేర్కొంది. పైపెచ్చు.. వాసుకీని బలపరుస్తూ తగినన్ని ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ఈ మెయిల్స్ రాకపోవడంతో ఆమె టాప్-10లో స్థానం దక్కించుకోలేకపోయినట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu