Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆపరేషన్‌ తర్వాత అల్లు అర్జున్‌ షూటింగ్‌

Advertiesment
అల్లు అర్జున్
, గురువారం, 1 సెప్టెంబరు 2011 (13:12 IST)
File
FILE
ప్రస్తుతం అల్లు అర్జున్‌ ఆస్ట్రేలియాలో ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు. యాక్షన్‌ సన్నివేశాల్లో భుజాల నొప్పితో బద్రినాథ్‌లో చాలా బాధపడ్డారు. అంతకుముందు చిత్రంలో జరిగిన గాయాలు.... మానినట్లు మాని క్రమేణా మరింతగా పెరిగాయి. దాంతో రియల్‌ఫైట్స్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. అయినా లెక్కచేయకుండా బద్రినాథ్‌లో ఫైట్స్‌చేశారు.

ఇదిలా ఉండగా, బద్రినాథ్‌ లాంటి చిత్రం తర్వాత అల్లు అర్జున్‌ నటించే చిత్రం ఏమయివుంటుందనే అభిమానుల నుంచి సామాన్యుడికి ఓ టాపిక్‌గా మారింది. జల్సా చిత్రంతో మాటలను ఖుషీ చేసిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. దానయ్య, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్‌ సరసన ఇలియానా నటిస్తోంది.

రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలను సెప్టెంబర్‌ 24న జరగనున్నాయి. హీరో అర్జున& ఆపరేషన్‌ నిమిత్తం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న కారణంగా అక్టోబర్‌ మొదటివారంలో షూటింగ్‌లో పాల్గొంటారు. దేవీశ్రీప్రసాద్‌ మరోసారి మ్యూజిక్స్‌ హిట్టచేయడానికి సిద్ధమవుతున్నారు. అతి త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu