కమల్‌కు "విశ్వరూపం" చూపించనున్న యోగా బ్యూటీ!
, శనివారం, 27 ఆగస్టు 2011 (10:08 IST)
టాలీవుడ్‌లో యోగా బ్యూటీగా పేరొందిన బొమ్మాళీ తమిళ అగ్రనటుడు కమల్ హాసన్‌కు "విశ్వరూపం" చూపించనుంది. ఇంతకీ.. విశ్వరూపం అంటే.. అనుష్క అందచందాల విశ్వరూపం కాదండీ బాబు. కమల్ దర్శకత్వం వహిస్తూ హీరోగా చేస్తున్న "విశ్వరూపం" అనే చిత్రంలో ఈ కుందనపు బొమ్మను ఎంపిక చేశారు. తొలుత ఈ చిత్రానికి హీరోయిన్‌గా శ్రియను ఎంపిక చేశారు. అయితే, శ్రియా కమల్‌తో నటించేందుకు నిరాకరించడంతో ఇషా శార్వాణికి ఆఫర్ ఇచ్చారు. ఈమె మొదట అంగీకరించినప్పటికీ ఇతర కారణాల రీత్యా ఇషాను తప్పించారు. అనంతరం ఎందరో హీరోయిన్లకు మేకప్ టెస్ట్ చేసిన కమల్ కన్ను బాలీవుడ్‌పై పడింది. "దబాంగ్" చిత్రంలో తన అందచందాలతో ఇరగదీసిన సోనాక్షిని ఆ తర్వాత దీపికా పడుకొనిని ఇలా అనేక మందిని ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. వీరంతా దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేయడంతో వారిని పక్కన పెట్టారు. చివరకు యోగా బ్యూటీ అనుష్కను కమల్ హాసన్ ఎంపిక చేశారు. కమల్ వంటి అగ్ర హీరో సరసన నటించే అవకాశం రావడం మహాభాగ్యంగా భావించిన అనుష్క.. ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. సో.. అనుష్క-కమల్ "విశ్వరూపం" చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలి.