Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బాయిక్కాదు.. అతని నాన్నారికి సారీ చెప్పిన కాజల్

Advertiesment
కాజల్ అగర్వాల్
, సోమవారం, 22 ఆగస్టు 2011 (15:58 IST)
WD
బాలీవుడ్ సినిమా ఒక్కటి హిట్టయిందో, కాజల్ అగర్వాల్ కళ్లు నెత్తిపైకి ఎక్కాయని కోలీవుడ్, టాలీవుడ్ సినీ దర్శకనిర్మాతలు పళ్లు నూరుతున్నారట. కాజల్ పేరు చెబితేనే కయ్యమంటున్నారట. వాళ్లెలా నూరుకుంటే నాకేమంట... అనే ధోరణిలో 'దడ' చిత్రం హీరో నాగచైతన్యను పూచికపుల్ల కంటే హీనంగా తీసిపారేసిన కాజల్‌కు అనుకోకుండా ఓ షాక్ తగిలిందట. దీంతో కళ్లు బైర్లు కమ్మాయట.

ఇంతకీ ఆ సంగతేంటో అని చూస్తే... మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న "బిజినెస్‌మాన్" చిత్రంలో కాజల్‌ను నటింపజేసేందుకు సదరు చిత్ర నిర్మాత కాజల్‌ను సంప్రదించారట. అయితే అంతకంటే ముందే వారికి నాగ్‌తో బలమైన స్నేహం ఉండటంతో నాగ్ మోకాలడ్డే అవకాశం ఉందని కాజల్ సన్నిహితులు ఆమెతో చెప్పారట.

దీంతో ఏమనుకుందో ఏమోగానీ, ఓ శుభోదయాన నాగార్జున ఇంటి ముందు ప్రత్యక్షమైందట. అంతేకాదు నేరుగా నన్ను క్షమించండి అంటూ బేలగా ముఖం పెట్టి దీనంగా చూసిందట. మరీ అంతగా బెండ్ అయిపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు. నాగ్ కూడా అదే చేశాడట.

Share this Story:

Follow Webdunia telugu