Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మగాళ్ళతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది: ప్రీతి

Advertiesment
ప్రీతి జింతా
, సోమవారం, 22 ఆగస్టు 2011 (09:58 IST)
అబ్బా.. ఈ మగాళ్ళతో మాట్లాడాలంటేనే భయమేస్తోందని సొట్టబుగ్గల చిన్నది ప్రీతి జింతా అంటోంది. ఏ పుట్టలో ఎలాంటి పాముందో ఎవరికేం తెలుసని అంటోంది. అందుకే.. మగరాయుళ్ళ చెంతకు చేరాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాల్సి వస్తోందని వాపోతోంది.

ఇంతకీ.. ఈ సొట్టబుగ్గల చిన్నదాన్ని అంతగా భయపెట్టిన మగాడెవరబ్బా అని బాలీవుడ్ పరిశ్రమ చర్చించుకుంటుందట. ఎవరితోనైనా సరదాగా మాట్లాడినా, జనం ఏదో ఒక లింకు పెట్టేస్తున్నారట. తన క్రికెట్ ఫ్రాంచైజీ భాగస్వామి నెస్ వాడియాతో ఆమె దోస్తీ ఇటీవలే చెడిన విషయం తెల్సిందే. క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ప్రీతీ చా....లా క్లోజ్‌గా ఉంన్నది. అలాగే, ఒకప్పటి తన టీం ఆటగాడు బ్రెట్‌లీతోనూ ఇదే విధంగా ఉండటమే కాకుండా ఓ నైట్ పార్టీలో వీరిద్దరు మరింతగా దగ్గరైనట్టు ఆ మధ్య వదంతులు కూడా వచ్చాయి.

అందుకే.. ఏ మగాడితో మాట్లాడినా.. లేనిపోని గోల ఎందుకంటూ ఆమె ఏకంగా మగాళ్లతో మాట్లాడడం మానేసిందట. దీనిపై ఈ లిరిల్ గళ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నా దృష్టంతా నా కెరీర్‌పైనే. ఎవరైనా మగాళ్లు పలుకరించినా, మీ ఆవిడతో కలిసున్నపుడే పలకరించండి అని చెప్పేస్తున్నా. ఎందుకంటే ఎవరితోనైనా సరదాగా మాట్లాడినా ఏదో ఒక లింకు అంటగట్టేస్తున్నారు. ఇలా ఉండడం నాకు చాలా బాధగానే అనిపిస్తోందని వాపోయింది.

Share this Story:

Follow Webdunia telugu