Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బా.. ఏం చెర్రీరా బాబు.. ఉండచోట ఉండట్లేదు..!!

Advertiesment
రాంచరణ్
, బుధవారం, 13 జులై 2011 (19:05 IST)
WD
మెగాస్టార్ పుత్రరత్నం చెర్రీ ఉండచోట ఉండట్లేదు. ఏదో ఒకటి గెలుకుతూ వివాదాల్లో చిక్కుకుంటున్నాడని టాలీవుడ్ ఫిలిమ్ జనం చెప్పుకుంటున్నారు. ఇంతకీ కొత్తగా మళ్లీ ఏం వచ్చి పడిందయా..? అని ప్రశ్నిస్తే... ఇలా సెలవిచ్చారు.

మొన్నామధ్య దాసరిపై కామెంట్ చేసి మీడియాలో "మగధీర" అయిన చెర్రీ ఇటీవల అమెరికాలో జరిగిన నాట్స్ వేడుకల్లో ప్రియమణిపై ఓ సెటైర్ బాణం విసిరాడట.

కార్యక్రమానికి హాజరైనవారంతా ప్రియమణిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి సమాధానాలు రాబట్టుకున్న తదనంతరం చెర్రీ కూడా ప్రియమణిని ఓ ప్రశ్న అడగాలని కోరాడట. అందుకు ప్రియ.. సరే అడగండి అనేసరికి.. మీకు ఫిలిమ్ ఫేర్ అవార్డు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించాడట.

అయితే అడిగే విధానంలో కాస్త వ్యంగ్యం ఉండేసరికి ప్రియమణికి ఎక్కడో మండిందట. దీంతో కొనుక్కుంటే తనకు ఆ అవార్డు వచ్చిందని మంకు సమాధానం చెప్పి అక్కడి నుంచి విసవిస వెళ్లిపోయిందట. ఈ పరిణామంతో "ఏంటి చెర్రీ మరీనూ.." అని అక్కడివారు రాంచరణ్‌తో అన్నారట.

Share this Story:

Follow Webdunia telugu