Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరిహద్దులు దాటారు.. ఆరబోస్తున్నారు!!

Advertiesment
తెలుగు
టాలీవుడ్ భామలు అవకాశాల కోసం విమానమెక్కుతున్నారు. దక్షిణాదిలో పోటీ ఎక్కువ కావడంతో ఉత్తరాదిపై దృష్టి సారించారు. ఇక్కడ అరకొరగా చూపించిన అందాలను అక్కడ ఆరబోసేందుకు సై అంటున్నారు. ప్రత్యేకించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కట్టుబొట్టుతో అడపాదడపా లంగా ఓణీలతో అచ్చతేనె తెలుగమ్మాయిలుగా కనిపించిన.. ఈ ముద్దుగుమ్మలు బాలీవుడ్ హీరోల సరసన చేరే సరికి తమలోని సిగ్గును పూర్తిగా మరిచిపోయారు. 

ముఖ్యంగా, తమ అందచందాల ఆరబోతకు ఉన్న కట్టుబాట్ల సరిహద్దును చెరిపేసుకున్నారు. త్రిష "కట్టా మీటా" చిత్రంలో నటించాక బాలీవుడ్‌లో అంతగా అవకాశాలు లేక మళ్లీ దక్షిణాది పంచన చేరింది. ఇటీవల 'తీన్‌మార్' చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌తో హాట్‌హాట్‌ చుంబన దృశ్యాలలో జీవించేసింది. పైగా ఆ సినిమా ఆద్యంతం కూడా త్రిష ఎక్కువగా మిడ్డీ, స్కర్ట్‌లతో ఎంతగా కావాలంటే అంతగా ఎక్స్‌పోజింగ్‌ చేసి సరికొత్త త్రిషను తలపించింది.

ఇకపోతే.. అవకాశం ఉన్నప్పుడే సొమ్ము చేసుకోవాలని అసిన్‌ కూడా కురచదుస్తులతో, లాకప్‌లిప్‌ సన్ని వేశాలతో అలరిస్తోంది. జెనీలియా ఇప్పటిదాకా అటువంటి పాత్రలు చేయకపోయినా రాబోయే బాలీవుడ్‌ సినిమాలో హీరో జాన్‌ అబ్రహాంతో కలిసి గాఢచుంబన దృశ్యాలలో నటించేందుకు సై అంటోంది.

ఇప్పటికే కొన్ని మేగజైన్‌ కవర్‌పేజీలపై ఎక్స్‌పోజింగ్‌కు తనకు అభ్యంతరం లేదన్న సంకేతాలు ఇచ్చేసినట్లుగా హాట్‌ ఫోజులు ఇచ్చిన జెనీలియా మన తెలుగు సినిమాలలో మాత్రం మంచి పిల్లగా పేరు తెచ్చుకుంది. ఇక "బర్ఫీ" చిత్రం ద్వారా బాలీవుడ్‌కు తొలిసారిగా ఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా ఇప్పటికే బాహాటంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది.

టాప్‌లెస్‌గా, చుంబన దృశ్యాలలో అవసరం మేరకు నటించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసింది. అందులో ఎంతగా ఎక్స్‌పోజింగ్‌ చేస్తే బాలీవుడ్‌ ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారని పేరు ఎలానూ ఉంది. కాబట్టి అక్కడిదాకా వెళ్లాక మడికట్టుకు కూర్చుంటే సరికాదని ముందుగానే మన టాలీవుడ్‌ భామలు సంప్రదాయ వస్త్రాలకు టాటా చెప్పేశారు.

Share this Story:

Follow Webdunia telugu