Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోమో సెక్స్ అనారోగ్యమా..? ఆయనెలా చెప్పగలరు..?!!

Advertiesment
యానా గుప్తా
, గురువారం, 7 జులై 2011 (18:36 IST)
అసలే తెలంగాణా తలనొప్పితో గులాంనబీ ఆజాద్ గిలగిలలాడుతుంటే ఆయనను కొత్తగా "గే" కమ్యూనిటీ పట్టుకుని ఉతికి ఆరేసే పనిలో పడింది. పురుషులతో పురుషులు, మహిళలతో మహిళలు పాల్గొనే సెక్స్.. "గే"యిజం దేశానికి దరిద్రంలా పట్టుకుందని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి గులాంనబీ ఆజాద్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై దేశంలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. 

ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు గే కమ్యూనిటీకి వత్తాసు పలుకుతూ ఆజాద్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు చేశారు. వీరిలో బిపాసా ముందు వరుసలో ఉన్నది. హోమో సెక్సువాలిటీని చిన్నచూపు చూడటం తగదనీ, దీనికి కోర్టు సైతం చట్టబద్ధత కల్పించిన తర్వాత మంత్రిగారు అలా ఎందుకు మాట్లాడారో తనకైతే అర్థం కావడం లేదని వాపోయింది.

అంతేకాదు.. విశాలంగా చూస్తే గే కల్చర్ ఎంతలా వ్యాపించి ఉందో.. వాళ్లంతా ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో అర్థమవుతుందని లెక్చర్లు కూడా ఇచ్చేస్తోంది.

ఇక యానాగుప్తా అయితే హోమోసెక్స్ అనేది అనారోగ్యం అని ఎలా చెప్పగలరు అని ప్రశ్నిస్తోంది. మంత్రిగారికి అది అనారోగ్యమని ఎలా తెలుసు అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రేమ ఎక్కడుంటే సెక్స్ అక్కడ ఉంటుందని, దానికి లింగభేదం లేదని నొక్కి వక్కాణిస్తోంది. ఇష్టపడినప్పుడు ఎవరితోనైనా రమించడం వారి వారి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుందని వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu