టాలీవుడ్‌లో వాంటెడ్, మిరపకాయ్ వంటి చిత్రాల్లో నటించి ఆనక పొట్టి హీరోల సరసన ఛాన్సులు రాక కోలీవుడ్ వెళ్లిన దీక్షాసేథ్‌కు అక్కడా చుక్కెదురైంది. విక్రమ్ హీరోగా, దీక్ష హీరోయిన్‌గా తెరకెక్కుతున్న "రాజపాటై" పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
శింగనమల రమేష్ తన కుమారులను నిర్మాతలుగా చేసి నిర్మిస్తున్న ఈ చిత్రం రమేష్ అరెస్టుతో పరిస్థితి గందరగోళంలో పడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం శింగనమల ఎకౌంట్లను పోలీసులు స్తంభింపజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనుక సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.
ఇదే గనుక జరిగితే దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి పెద్ద బ్రేక్ పడిపోవడం ఖాయం. ఈ విషయం తెలిసిన దగ్గర్నుంచి దీక్ష తెగ బాధపడిపోతోందట.