Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐటం సాంగ్‌లకు బాలీవుడ్ భామల పోటీ!

Advertiesment
తెలుగు
తెలుగులో ఐటం సాంగ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇది మెల్లగా బాలీవుడ్‌ను తాకింది. దీంతో ఐటమ్ సాంగ్‌లలో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు పోటీ పడుతున్నారు. తాజాగా, సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'దబాంగ్' చిత్రంలోని 'మున్నీ బద్నామ్‌ హురూ'తో మొదలైన హవా ఆ తర్వాత కత్రినా కైఫ్‌ నటించిన 'తీస్‌మార్‌ఖాన్' చిత్రంలో 'షీలాకీ జవానీ' పాటతో ఊపందుకుంది. దీంతో ప్రేరణ చెందిన కరీనా కపూర్, మల్లికా షెరావత్ వంటి తారలంతా ఐటంసాంగ్స్‌లు చేసేందుకు తహతహలాడుతున్నారు.

టాలీవుడ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లను కేవలం జ్యోతిలక్ష్మీ, జయమాలిని, సిల్క్‌స్మిత, అనురాధల తర్వాత అభినయశ్రీ, అల్ఫోన్సా, ముమైత్‌ ఖాన్‌ వంటి వారు తీర్చారు. చిత్రంలో వీరు చేసే ఒక్క పాటకే మంచి క్రేజ్‌తో పాటు.. పారితోషకం అందుతుండటంతో అగ్ర హీరోయిన్లు పోటీ పడుతున్నారు.

ఈ ఒక్కపాటకే కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం వారు కేటాయించే కాల్షీట్లు కేవలం నాలుగైదు రోజులు మాత్రమే. అందుకే ఐటమ్ సాంగ్‌లలో నటించడం వల్ల వచ్చే మనీతో పాటు.. క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని బాలీవుడ్ భామలు సైతం పోటీ పడుతున్నారు.

ఈ భామలు కేవలం బాలీవుడ్‌లలోనే కాకుండా టాలీవుడ్‌పై కూడా దృష్టిపెట్టడం గమనార్హం. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన చందమామరావే చిత్రంలో ఐశ్వర్యారాయ్ ఓ ఐటంసాంగ్‌లో ప్రత్యేకంగా నర్తించింది.

ఆ తర్వాత దీపికా పదుకునే కూడా తెలుగులో ‘లవ్‌ 4 ఎవర్‌’ చిత్రంలో కనిపించింది. ఈ మధ్య ప్యాంటీగాళ్‌గా బ్యాడ్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న యానాగుప్తా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్‌దాదా ఎంబిబిఎస్'’ చిత్రం లో ఓ ఐటమ్ సాంగ్‌లో హాట్‌హాట్‌గా కనిపించింది.

యువ హీరో నాగ చైతన్య కొత్త చిత్రం 'దడ'లో నాగచైతన్యతో కలిసి ఓ పాటలో స్టెప్పులేయనుంది. అలాగే బాలకృష్ణ హీరోగా నటించిన 'పరమ వీరచక్ర'లో నేహా ధుపియా గెస్ట్‌రోల్‌ చేయడమేగాక ఒక ఐటమ్ సాంగ్‌ కూడా చేసింది. మొత్తం మీద ఐటమ్ సాంగ్‌లతో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ హీరోయిన్లు పోటీ పడటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu