"ఆరెంజ్" రిలీజ్‌కు ముందే కోటిన్నర ప్రాఫిట్ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత మన్యం రమేష్ నిర్మాత అయిన తన బావ నాగబాబుతో చెప్పాడట. సరేలే ఏదోవిధంగా లాభపడ్డామని అనుకున్నాడట. అయితే విడుదలైన తర్వాత ఆరున్నరకోట్ల డెఫిషియట్ చూపించాడట. రెండోరోజుకు 18కోట్లకు చేరింది. దీంతో షాక్‌కు గురైన నాగబాబు మన్యం రమేష్‌ను చెడామడా తిట్టేశాడట. దీంతో మనస్థాపం చెందిన రమేష్ ఇంటికి వెళ్లకుండా రోజంతా ఎక్కడో ఉండిపోయాడు.
బావ మొహంలో ఆనందం చూడాలనుకున్నాను. ఇంత కోపం చూడలేక నేను వెళ్లిపోయానని తన ఇంటికి ఫోన్ చేశాడట. ఈ విషయం నాగబాబుకు తెలిసి వేట మొదలెట్టారు. ఫోన్ కాల్ ఏ ఏరియా నుంచి వచ్చిందని ఎంక్వైరీ చేయగా, గచ్చిబౌలి నుంచి అని తెలిసింది. అక్కడికి వెళ్లి ఓ రూమ్‌లో ఉన్న రమేష్‌ను నాగబాబు మంచిగా పలుకరించి.. డబ్బు పోతే పోయింది. నువ్వుపోతే ఎక్కడి నుంచి తేను... అని కాస్త కుదుటపడేలా మాట్లాడారట.
ఆ తర్వాత కారులో వచ్చేటప్పుడు నానా బూతులు తిట్టి వెధవా.. ఎందుకు బతకడం అని తిట్ల వర్షం కురిపించారట. దీంతో నాగబాబు సోదరి క్షమించమని వేడుకొనగా నీ మొహం చూసి వదిలేశానని చెప్పాడట. ఇక ఆ తర్వాత ఎకౌంట్స్ పరిశీలిస్తే... ఆరున్నర కోట్లు రమేష్ వెనకేసినట్లు తేలిందట. ఆ డబ్బుతో రెండు చిన్నపాటి చిత్రాలు తీయాలనే ప్లాన్‌లో ఉన్నాడని ఆయనకు సమాచారం అందింది. దీంతో మింగలేక... కక్కలేక.. ఇక నుంచి వాడి మొహం చూడనని నాగబాబు చెప్పాడట.