త్రిష పెద్ద తిండిబోతట. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిన దగ్గర్నుంచి నోటిని ఆడిస్తూనే ఉంటుందట. అంతేకాదు... ఈ బక్కపలచని భామకు రోజుకో వెరైటీ ఫుడ్ ఐటమ్ కావాలట.
ఈ వెరైటీలను తెచ్చి పెట్టలేక త్రిష మామ్ ఉమ ఒకింత ఇబ్బంది పడుతోందట. కానీ త్రిష మాత్రం తన తిండిని ఏమాత్రం తగ్గించుకోవడం లేదట. తనకు ఇష్టమైన ఆహారపదార్థాలను గొంతుకాన తినేసి ఆ తర్వాత బరువు పెరుగుతానేమోనని తెగ బాధపడిపోతుందట.
నోటికి అందినది అందినట్లు తిన్నందుకు కొవ్వు పెరుగుతుంది కనుక ఆ కొవ్వును కరిగించుకునేందుకు తగిన వ్యాయామం చేయకపోతే బండలా మారిపోతానేమోనని భయపడి, ట్రెడ్ మిల్‌పై గంటలకొద్దీ పరుగులు తీస్తుందట. తిన్నదంతా అరిగిపోయి నీరసం వచ్చేవరకూ అదే పనిగా వ్యాయామం చేస్తుందట.
అయితే ఇటీవల కాలంలో సినిమా ఛాన్సులు కాస్త తగ్గడంతో ఇంట్లో కూచుని నోటికి పని చెప్పడమే పెద్దపనిగా పెట్టుకున్నదట. కడుపారా తిన్న తర్వాత హ్యాపీగా మంచి నిద్ర లాగించేస్తుందట. వ్యాయామాన్ని మరిచి కొంచెం బొద్దుగా కూడా మారిందట. ఒక్కసారి "బండ"లా మారితే ఇక స్లిమ్‌గా మారడం చాలా కష్టమని త్రిషకు తెలుసో లేదో మరి..!!