శ్రీరామదాసు చిత్రంలో సీత పాత్ర పోషించి ప్రేక్షకుల చేత ఫర్వాలేదనిపించిన నటి అర్చన అలియాస్ వేదను అందరూ అమాయకురాలనుకున్నారు. కాని వాటన్నింటికీ తెర దించుతూ ఇటీవల బ్యాంక్ చిత్రంలో సెక్సీ పాత్ర పోషిస్తు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సారథ్యంలో యువసామ్రాట్ నాగార్జున నటించిన శ్రీరామదాసు చిత్రంలో తనకు ఓ పాత్ర వచ్చే సరికి తెగ ఆఫర్లు వచ్చేస్తాయని భావించింది. అయితే అనుకున్న విధంగా జరుగక అన్నీ తారుమారై పోయేసరికి పాపం చివరికి బ్యాంక్ చిత్రంలో రోబరీ గ్యాంగ్‌ను మైమరపించే సెక్సీ పాత్రను పోషిస్తోంది.
అంతే కాదండోయ్ శ్రీరామదాసులో పతివ్రత పాత్రవేసి ఆదర్శంగా ఉండే మాట అటుంచి సినిమా షూటింగ్‌లోనే కాదు ఫంక్షన్స్‌కు కూడా సెక్సీ దుస్తులు ధరించి కనపడుతోందిట... సినిమాలోనే కాదు స్టేజీ మీద కూడా ఇలాగే కనిపించాలా అంటూ అందరూ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే వేద మాత్రం కనీసం ఇలాగైనా ఆఫర్లు రాకపోతాయా అని భావిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు కోడైకూస్తున్నాయి. ప్చ్... పాపం వేద... ఆల్ ది బెస్ట్ వేదా....