అక్కినేని నాగేశ్వర రావు 90వ బర్త్‌డే వేడుకలు 20న
, గురువారం, 19 సెప్టెంబరు 2013 (13:08 IST)
తెలుగు సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వర రావు 90వ పుట్టినరోజు వేడుకలు ఈనెల 20వ తేదీన ఘనంగా జరుగనున్నాయి. ఈ వేడుకలను టి సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్తు నిర్వహించనుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి అధ్యక్షత వహించే సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, అతిథులుగా కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి, మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా సి.నారాయణ రెడ్డి, సుప్రసిద్ధ నటి వైజయంతీ మాల, సీనియర్ నిర్మాత డి. రామానాయుడు తదితరులు పాల్గొననున్నారు.