Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ది డర్టీ పిక్చర్స్" విడుదలకు తొలగిన అడ్డంకులు!!

Advertiesment
ది డర్టీ పిక్చర్స్
, గురువారం, 1 డిశెంబరు 2011 (15:38 IST)
బాలీవుడ్ నటి 'ది డర్టీ పిక్చర్స్' చిత్రం విడుదలకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్‌ ప్రముఖ నటి విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో ఏక్తాకపూర్ నిర్మించిన చిత్రం ది డర్టీ పిక్చర్స్. తెలుగు నటి దివంగత సిల్క్‌స్మిత జీవిత గాధను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. అందువల్ల ఈ చిత్రం విడుదలను అడ్డుకోవాలని కోరుతూ సిల్క్‌స్మిత సోదరుడు నాగ వరప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత నాగ వరప్రసాద్ పిటీషన్‌ను కొట్టివేసింది.

దీంతో సినిమా రిలీజ్‌కు కోర్టు పరంగా అడ్డంకులు తొలగిపోయాయి. అయితే సినిమా విడుదలయ్యాక ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే పరువు నష్టం దావా వేసుకోవచ్చునని పిటిషన్ వేసిన స్మిత సోదరుడికి సూచించింది. కాగా ది డర్టీ పిక్చర్ చిత్రం శుక్రవారం రోజు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తన సోదరిని అవమానపర్చే విధంగా ఉందని దానిని నాగవర ప్రసాద్ ఆరోపిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu