Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజినీ అల్లుడు ధనుష్ "కొలవెరి" 'దుసటచతుసటయ'కి వీరతాళ్లు

Advertiesment
ధనుష్
, సోమవారం, 28 నవంబరు 2011 (13:05 IST)
FILE
ఒకప్పుడు మాయాబజార్(ఎన్టీఆర్-ఏఎన్నార్-ఎస్వీఆర్) సినిమాలో ఘటోత్కచుడు తన శిష్యగణం "దుష్టచతుష్టయం" అనే పదాన్ని "దుసటచతుసటయ" అని పలికితే అలా ఆ దుష్టచతుష్టయాన్ని పలుకడంలోనే చీల్చిచెండాడినందుకు వారిని పొగడ్తలతో ముంచెత్తుతూ వీరతాళ్లు వేయమంటాడు. ఇపుడు రజీనీకాంత్ అల్లుడు ధనుష్ అలాంటి పొగడ్తలనే అందుకుంటున్నాడు.

ఇటీవల ఆయన రాసి, పాడిన పాట "వై దిస్ కొలవెరి.. కొలవెరి.. కొలవెరి డి" అనే పాట అనూహ్యంగా నెట్‌లో ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. నెటిజన్లు ఆ పాటను మళ్లీ మళ్లీ వింటూ పిచ్చపిచ్చగా పాపులర్ చేసి పారేస్తున్నారు. దీంతో ధనుష్ ఉత్సాహానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇంతకీ తమిళ హీరో ధనుష్ పాడిన ఆ పాటలోని సాహిత్యం ఏంటయా.. అని చూస్తే.. గ్రామర్ లేని ఇంగ్లీషును తన ఇష్టం వచ్చినట్లు.. అంటే దుసటచతుసటయ లాగా ఇంగ్లీషును విరిచివిరిచి పాటను ఆలపించారు. ఈ పాటను జనం ఆకాశానికెత్తేస్తున్నారు. తెగ వింటున్నారు.

సాహితీ విమర్శకులు మాత్రం ధనుష్ పాటపై తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అది అసలు పాటే కాదనీ, సాహిత్యమే లేదని అంటున్నారు. హీరో ధనుష్ కూడా వారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. తాను రాసింది నాన్సెన్స్ అని ఒప్పుకుంటాననీ, కానీ జనం నాన్సెన్స్‌నే బాగా ఆదరిస్తున్నారు కనుక అలాగే నడుచుకోక తప్పదని సమాధానమిస్తున్నారు. అవును నలుగురు ఏ దారిన నడుస్తున్నారో మనం కూడా అదే దారిన నడవాలి తప్పదు.. మేకను కుక్క అని చెప్పినా నమ్మక తప్పదు మరి. అంతే..!!

తాజా చిత్రం 3 కోసం ఆయన ఈ పాటను పాడారు. మిగిలిన పాటలు చాలా బావుంటాయని అంటున్నాడు. అలాగని భవిష్యత్తులో ఇటువంటి నాన్సెన్స్ పాటలు మరిన్ని రాస్తానని అనుకోవద్దని సెలవిస్తున్నాడు. మరి మన హీరోలు కూడా ఇటువంటి దుసటచతుసటయపై దృష్టి పెడతారేమో చూద్దాం.

Share this Story:

Follow Webdunia telugu