Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'డర్టీ పిక్చర్' చిత్రాన్ని నిషేధించాలి : కోర్టులో పిటీషన్

Advertiesment
డర్టీ పిక్చర్ చిత్రం
, గురువారం, 3 నవంబరు 2011 (13:45 IST)
ప్రముఖ సినీ నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా నిర్మితమైన 'డర్టీ పిక్చర్'పై విడుదలకు ముందే వివాదం చెలరేగింది. అవాస్తవాలతో కథను తయారు చేశారని, అసభ్య దృశ్యాలతో ఆ సినిమా తీశారని పేర్కొంటూ సిల్క్ స్మిత సోదరుడు నాగవరప్రసాద్ చిత్ర నిర్మాతలపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 

ఇదే విషయంపై చిత్ర నిర్మాతకు తన తరపు న్యాయవాది నోటీసు ఇచ్చినా స్పందించలేదని ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల డర్టీ పిక్చర్ చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు. పైపెచ్చు.. సిల్క్ స్మిత జీవితం గురించి తమను సంప్రదించకుండా ఏకపక్షంగా చిత్రంలో అనేక కథాంశాలను జోడించారని అందువల్ల విధిలేని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు.

అందువల్ల చిత్రం విడుదల కాకుండా స్టే విధించాలని నాగవరప్రసాద్ హైకోర్టును కోరారు. కాగా, ఈ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను ప్రముఖ నటి విద్యాబాలన్ పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తర్వాత అనేక టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ బండారం బయటపడొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu