Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమల్‌హాసన్ బాడీ ‌+ బాలయ్య తల = హరహర మహాదేవ

Advertiesment
బాలకృష్ణ
, శనివారం, 11 జూన్ 2011 (12:07 IST)
WD
ఈ ఫొటో చూశారా... కమల్‌హాసన్‌ నటించిన 'దశావతారం' చిత్రంలోని స్టిల్‌కు బాలకృష్ణ హెడ్‌ తగిలించి వాల్‌పోస్టర్లుగా చేశారు. ఇది చూసినవారు షాక్‌కు గురయ్యారు. కండలు తిరిగిన కమల్‌ బాడీకి తల ఏమాత్రం గుర్తుపట్టకుండా మార్ఫింగ్‌ చేసి "హరహర మహదేవ" ఓపెనింగ్‌లో పెట్టి, టైటిల్‌ కూడా పెట్టడంతో పెద్ద చర్చనీయాంశమైంది.

మళ్ళీ బాలయ్య ట్రాప్‌లో పడ్డారా? అనిపించింది. అభిమానులే ఈ స్టిల్స్‌ చూసి షాక్‌కు గురయ్యారు. బాలయ్యకు అంత అవసరం ఏమిటి..? ఫోటో సెషన్‌ చేసి జాగ్రత్తగా పెట్టవచ్చుగదా అని చెప్పుకోవడం కనిపించింది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరగాలంటే ఇంకా అక్టోబర్‌ వరకు ఆగాల్సిందే. హడావుడి వంటకంలా పుట్టినరోజు నాడే ఏదో ఓపెన్‌ చేయాలని చేసినట్లుగా ఉంది. తను చెప్పిన డైలాగ్‌లు కూడా రాత్రికిరాత్రి బట్టీపట్టి చదివినట్లుగా అక్కడ అప్పచెప్పాడు బాలయ్య.

బెల్లంకొండను పొగడ్తల్తో ముంచెత్తిన బాలయ్య!
ఒకప్పుడు బెల్లంకొండ సురేష్‌ను తుపాకితో కాల్చినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బాలయ్య.... ఈ పుట్టినరోజునాడు బెల్లంకొండను పొగడ్తలతో ముంచెత్తాడు. మంచి నిర్మాతకు నిదర్శనం సురేష్‌ అంటూ పొగిడాడు.

ఇండస్ట్రీ నిలబడాలంటే నిర్మాతలు అవసరం. అటువంటి నిర్మాతల్లో బెల్లంకొండ సురేష్‌ ఒకరని అనగానే.. అభిమానులు కేకలతో హోరెత్తింది. మరి అటువంటి నిర్మాతపై కాల్పులకు ఎందుకు పాల్పడినట్లో అని కొందరు అనుకోవడం కనిపించింది.

Share this Story:

Follow Webdunia telugu