ప్రముఖ నిర్మాత దేవీవరప్రసాద్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అశ్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు.
మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్‌లతో అత్యధిక సినిమాలను నిర్మించిన దేవీవరప్రసాద్ విజయవాడలో 1943లో జన్మించారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని, చిత్ర నిర్మాత మండలిలో చురుకుగా ఉండే దేవీవరప్రసాద్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు సినీ ప్రముఖులు ప్రకటించారు.
కాగా దేవీవరప్రసాద్ అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామంలో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.