Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలిషెడ్యూల్‌ పూర్తయిన "నితిన్" సినిమా

Advertiesment
తొలిషెడ్యూల్‌ పూర్తయిన
, గురువారం, 11 అక్టోబరు 2007 (13:47 IST)
నితిన్, మమతా మోహన్‌దాస్, సింధుతులాని, శశాంక్ ప్రధాన తారాగణంగా, ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోన్న నితిన్ చిత్రం తొలి షెడ్యూల్ గురువారంతో పూర్తవుతుంది. ఈ విషయాన్ని నానక్‌రామ్ గూడాలోని సిలీవిలేజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర సమర్పకుడు అచ్చిరెడ్డి వెల్లడించారు. గత కొద్ది రోజులుగా నానాక్‌రామ్ గూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 3 నుంచి రెగ్యులర్ షెడ్యూల్ ప్రారంభమయిందని చెప్పారు. నితిన్‌కు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందన్నారు. "సామాన్యుడు" చిత్రం తర్వాత దర్శకుడు చాలా కసితో చేస్తున్న ఈ చిత్రం అందరికీ పేరు తెస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు రవి. సి. కుమార్ విలేకరులతో మాట్లాడుతూ... కథానుగుణంగా బడ్జెట్‌కు పరిమితం లేకుండా, వర్కింగ్ డేస్ నిబంధనలు లేకుండా నిర్మాత చక్కని సహకారం అందించారని చెప్పారు. ప్రేమ, యాక్షన్ అంశాలతో చక్కటి మెసేజ్‌కూడా ఇందులో ఇమిడి ఉందన్నారు.

హీరోయిన్ మమతామోహన్ మాట్లాడుతూ... ఇందులో తాను రెండు పాటలు పాడుతున్నాననీ, "యమదొంగ" తర్వాత అంతటి చక్కని పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నానని తెలిపారు.

"తాను మమతా, నితిన్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని, తనదీ గుర్తింపు కలిగే పాత్రేనని" సింధు తులాని అన్నారు. శశాంక్ మాట్లాడుతూ... నితిన్‌తో "సై" తర్వాత చేస్తున్న చిత్రమిది. ఇటీవలే "హ్యాపీడేస్"లో కూడా చేశానని చెప్పారు. ఆ చిత్రానికి పనిచేసిన విజయ్. సి కుమార్‌తో పనిచేయడం ఉత్సాహంగా ఉందని తెలిపారు.

ఈ నెలాఖరులో మలి షెడ్యూల్ జరుగనుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత వి. సురేష్ రెడ్డి తెలిపారు. ఇంకా అశుతోష్‌రాణా. ఎం.ఎస్. నారాయణ, తనికెళ్ళభరణి, రఘుబాబు, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, ఆర్ట్‌: వెంకటేశ్వరరావు, నిర్మాత: వెంకట్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రవి సి.కుమార్.

Share this Story:

Follow Webdunia telugu