Candidate Name |
వి. శ్రీనివాస్ గౌడ్ |
State |
Telangana |
Party |
BRS |
Constituency |
Mahbubnagar |
Candidate Current Position |
Telangana state Minister |
వి.శ్రీనివాస్ గౌడ్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగి నుంచి రాజకీయ నేతగామారిన నేతల్లో వి. శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, క్రీడలు, యువజన సేవలు, పర్యాటకం, సంస్కృతి, పురావస్తు శాఖ మంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి నుండి తెలంగాణ శాసనసభకు మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వి.శ్రీనివాస్ గౌడ్ 1969 మార్చి 16న ప్రస్తుత తెలంగాణలోని హైదరాబాద్‌లో వి.నారాయణ్ గౌడ్, శాంతమ్మ దంపతులకు జన్మించారు. రదను వివాహం చేసుకున్న గౌడ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బీఎస్పీ, పీజీడీసీజే, పీజీడీడబ్ల్యూఎంఎం విద్యాభ్యాసం పూర్తి చేశారు. జర్నలిజంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశారు. రాష్ట్ర సివిల్ సర్వీసెస్ క్లియర్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరారు. రాజకీయాల్లో కెరీర్ ప్రారంభించే ముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జోనల్ కమిషనర్‌గా పనిచేశారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో 1998లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు.
రాజకీయ జీవితం : గౌడ్ రాజకీయ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించారు. అతను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ రాష్ట్ర ప్రభుత్వ అధికారి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీకి కో-ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. శ్రీనివాస్ గౌడ్ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 13 మార్చి 2014న రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అతను తెలంగాణా శాసనసభ ఎన్నికలలో, 2014 మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. శ్రీనివాస్ గౌడ్ 57,775 మెజారిటీతో 2వ సారి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇదే అత్యధిక మెజారిటీ విజయం కావడం గమనార్హం. యన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, కేటీఆర్‌లకు అత్యంత సన్నిహితుడు కావడంతో 19 ఫిబ్రవరి 2019న తెలంగాణ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, యూత్ సర్వీసెస్, స్పోర్ట్స్, టూరిజం, కల్చర్ మరియు ఆర్కియాలజీ మంత్రిగా పని చేస్తున్నారు.