Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment
Candidate Name తలసాని శ్రీనివాస్ యాదవ్
State Telangana
Party BRS
Constituency Sanath Nagar
Candidate Current Position Telangana state Minister

తలసాని శ్రీనివాస్ యాదవ్ : తలసాని శ్రీనివాస్ యాదవ్ 1965 అక్టోబరు ఆరో తేదీనవెంకటేశం యాదవ్ - లలితాభాయ్ దంపతలకు జన్మించారు. సువర్ణ అనే మహిళను వివాహం చేసుకోగా, వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నేతల్లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందారు. 
 
రాజకీయ నేపథ్యం : తలసాని 1986లో జనతా పార్టీ అభ్యర్థిగా మోండా మార్కెట్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించి ఓడిపోయారు. శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరి 1994లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 అసెంబ్లీ ఎన్నికలలో, తలసాని కాంగ్రెస్ పార్టీకి చెందిన మేరీ రవీంద్రనాథ్‌ను ఓడించి, నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కార్మిక, పర్యాటక శాఖ మంత్రి అయ్యారు.
 
2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసిన టి.పద్మారావు గౌడ్ చేతిలో ఓడిపోయారు. శ్రీనివాస్ యాదవ్ 2008 అసెంబ్లీ ఉప ఎన్నికలలో తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిట్ల కృష్ణను 18,067 ఓట్లతో ఓడించి, 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి దాదాపు 5000 ఓట్లతో సినీ నటి మరియు కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ చేతిలో ఓడిపోయారు. 2005లో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడయ్యాడు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీనివాస్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2018లో సనత్ నగర్ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై 19 ఫిబ్రవరి 2019న రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.