Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment
Candidate Name శ్రీధర్ బాబు
State Telangana
Party INC
Constituency Manthani
Candidate Current Position MLA

దుద్దిళ్ల శ్రీధర్ బాబు 1969 మే 30 జన్మించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేత. ఆ రాష్ట్రం విభజించబడటానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. అతను ఇప్పుడు తెలంగాణలో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంథని నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.  శాసన సభ్యునిగా ఆయన నాలుగోసారి గెలుపొందాడు. శ్రీధర్ బాబు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులలో ఒకరు. అతను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షులలో ఒకరిగా ఉన్నారు. 
 
శ్రీధర్‌బాబు 1969 మార్చి 9వ తేదీన జన్మించారు. ప్రముఖ కాంగ్రెస్ నేత శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు, జయమ్మల మూడో కుమారుడు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1999లో తండ్రి హత్య జరగడంతో ఆయన రాజకీయ వారసునిగా రాజకీయాల్లో అడుగుపెట్టి కొనసాగుతున్నారు. శ్రీధర్‌బాబు శైలజ రమ్య‌ను వివాహం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హాండీక్రాఫ్ట్స్ దేవ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఆమె వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
 
దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావును 1999లో మావోయిస్ట్ నక్సలైట్లు కాల్చిచంపారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన శ్రీధర్ బాబు.. 1999 శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. శ్రీధర్ బాబు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.