Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment
Candidate Name సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
State Telangana
Party BRS
Constituency Wanaparthy
Candidate Current Position Telangana state Minister

నిరంజన్ రెడ్డి : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి చేతిలో ఓడిన నిరంజన్ రెడ్డి... 2018లో అదే చిన్నారెడ్డిపై 51,685 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్, భాజపాల నుంచి కొత్త అభ్యర్థులను ఢీకొంటున్నారు. పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా, అనుజ్ఞారెడ్డి భాజపా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
 
తాము నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, 54 మినీ ఎత్తిపోతలతో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు. లభిస్తోందని నిరంజన్ రెడ్డి గుర్తుచేస్తున్నారు. వైద్య, నర్సింగ్, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు, వనపర్తిలో టౌన్ హాల్ నిర్మాణం, మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, కల్వర్టుపై వంతెనలు తదితర పనులు కళ్లముందే కనిపిస్తున్నాయనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. భారాస పెద్దమందడి, వనపర్తి ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం, జడ్పీ చైర్‌పర్సన్ లోక్‌నాథ్ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం కొంత ప్రతికూలంగా మారొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
 
లాయర్ వృత్తి నుంచి... : నిరంజన్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించకముందు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ వచ్చారు. 2001లో ఆయన తెరాస సభ్యత్వం తీసుకున్నారు. 1958 అక్టోబరు నాలుగో తేదీన వనపర్తి నియోజకవర్గంలోని పాన్‌గల్‌లో ఆయన జన్మించారు. హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు.