Candidate Name |
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి |
State |
Telangana |
Party |
INC |
Constituency |
Munugode |
Candidate Current Position |
Former MLA |
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌గా గుర్తింపు పొందిన సోదరుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. 1967 జూన్ ఒకటో తేదీన నల్గొండ జిల్లా, నార్కెట్‌పల్లి బ్రాహ్మణ వెల్లెం అనే గ్రామంలో జన్మించారు. ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఈయన అన్నే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రస్తుతం భువనగిరి నియోజకవర్గం నుండి 17వ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2009సలో భోంగీర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తల్లో ఒకరు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు.
రాజకీయ నేపథ్యం..: తెలంగాణ రాష్ట్రానికి చెందిన మునుగోడు మాజీ శాసనసభ సభ్యుడు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గత అక్టోబరు నెలలో బీజేపీలో చేరారు. మళ్లీ ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో భోంగీర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బూర నర్సయ్య గౌడ్ చేతిలో ఓడిపోయారు. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గానికి శాసనమండలి సభ్యునిగా గెలుపొందారు. మూడేళ్ళ పదవీకాలం మిగిలి ఉండగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 2018 అసెంబ్లీ ఎన్నికలలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా గెలుపొందారు. అతను తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల కోసం పోరాడాడు కానీ అధికార పార్టీ తెరాస వారి నియోజక వర్గీయుల డిమాండ్లను నెరవేర్చలేకపోయినందున అవన్నీ ఫలించలేదు. తద్వారా అతను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.