Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment
Candidate Name జూపల్లి కృష్ణారావు
State Telangana
Party INC
Constituency Kollapur
Candidate Current Position Former Minister

జూపల్లి కృష్ణారావు : జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, పెద్ద దగడ గ్రామంలో 1955 సంవత్సరం ఆగస్టు పదో తేదీన జన్మించారు. ఈయనకు భార్య సంజన, వరుణ్, అర్జున్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన... గత 2018 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. 
 
రాజకీయ కెరీర్ : జూపల్లి కృష్ణారావు బ్యాంకు ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా నిర్మాణ రంగంలో విజయం సాధించారు. ఈయన 1999, 2004, 2009, 2012 ఉప ఎన్నికలు, 2014లో మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆహారం, పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లో ఎండోమెంట్‌ మంత్రిత్వ శాఖ లభించింది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎన్నికైన తొలి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అయితే, 2011 అక్టోబరు 30వ తేదీన కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.