Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment
Candidate Name గంగుల కమలాకర్
State Telangana
Party BRS
Constituency Karimnagar
Candidate Current Position Telangana state Minister

గంగుల కమలాకర్.. తెలంగాణ మంత్రిగా పని చేస్తున్నారు. బీసీ సంక్షేమం, ఆహార, పౌర సరఫరాల మంత్రిగా ఉన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కమలాకర్ 1968 మే 8వ తేదీన మల్లయ్య , లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. రజిత అనే మహిళను పెళ్లి చేసుకోగా, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
 
2000 సంవత్సరంలో కరీంనగర్ మున్సిపాలిటీలో కార్పొరేటర్‌గా ఎన్నికైన కమలాకర్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) టికెట్‌పై కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013లో తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి 2014, 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికయ్యారు. కరీంనగర్ సాంప్రదాయకంగా వెలమ కులానికి బలమైన కోటగా పరిగణించబడుతుంది, అయితే బీసీ కమ్యూనిటీ నుండి వచ్చిన కమలాకర్ వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. 
 
సెప్టెంబర్ 2019లో, కమలాకర్‌ను రెండో కె.చంద్రశేఖర్ రావు మంత్రివర్గంలో చేర్చారు మరియు బీసీ సంక్షేమం, ఆహారం, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల పోర్ట్‌ఫోలియోను కేటాయించారు. కమలాకర్ మంత్రి కేటీ రామారావుకు అత్యంత సన్నిహితుడు, ఆయనను "కరీంనగర్ భీముడు" మరియు "కమలాకర్ అన్న" అనే మారు పేర్లు కూడా ఉన్నాయి.