Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Candidate Name దామోదర రాజనరసింహ
State Telangana
Party INC
Constituency Andole
Candidate Current Position Former Deputy CM

దామోదర రాజనర్సింహా : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతల్లో దామోదర రాజనర్సింహా ఒకరు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆంథోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖామంత్రిగా, వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. 1958, డిసెంబరు 5వ తేదీన జన్మించిన దామోదర రాజనర్సింహా దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. రాజా నరసింహా - జానాభాయ్ దంపతుల కుమారుడు. ఆంథోల్ అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. 
 
రాజకీయ ప్రస్థానం : 1989లో ఆంథోల్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి తొలిసారి గెలుపొందిన ఆయన... ఆ తర్వాత వరుసగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ప్రాథమిక విద్యా శాఖామంత్రిగా పని చేశారు. 2009లో మార్కెటింగ్ శాఖామంత్రిగాను, 2011 జూన్ పదో తేదీన ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.