Candidate Name |
ఆసన్నగారి జీవన్ రెడ్డి |
State |
Telangana |
Party |
BRS |
Constituency |
Armur |
Candidate Current Position |
MLA |
ఆసన్నగారి జీవన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలోని కీలక రాజకీయ నేతల్లో ఒకరు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తెరాస అత్యధిక సీట్లు గెలిచి అధికారంలోకి చ్చింది. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జీవన్ రెడ్డి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా జంకంపేట్. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని పూర్తి చేసిన ఈయన.. నిజామాబాద్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నారు.
ఆర్మూర్ స్థానం నుంచి బరిలో నిలిచిన జీవన్ రెడ్డి తాను పోటీ చేసిన ఎన్నికల్లోనే 13 వేల ఓట్ల మెజార్టీతో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి కేఆర్ సురేష్ రెడ్డిపై గెలుపొందారు. అలాగే, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణ కోసం మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో పర్యటించిన ఐదుగురు సభ్యుల కమిటీలో ఈయన ఒక సభ్యుడిగా ఉన్నారు. అలాగే, కేరళ రాష్ట్రంలో అమలవుతున్న మండల వ్యవస్థపై అధ్యయనం కోసం ఆ తిరువనంతపురంలో కూడా పర్యటించారు. ఈయన పోటీ చేస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామం దేశంలో ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందింది.