Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment
Candidate Name రేవంత్ రెడ్డి
State Telangana
Party INC
Constituency Kodangal
Candidate Current Position TPCC President

రేవంత్ రెడ్డి తెలంగాణలో చురుకైన రాజ‌కీయ నాయ‌కుడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కి చెందిన రేవంత్ రెడ్డి చిన్న‌నాటి నుంచే రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రిచేవారు. గ్రాడ్యూయేష‌న్ చ‌ద‌వుతున్న స‌మ‌యంలో ఆయ‌న అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్ నాయ‌కుడిగా ఉన్నారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ఏ.వీ. కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన త‌ర్వాత ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడు జైపాల్ రెడ్డి మేన‌కోడ‌లు గీతాను వివాహ‌మాడారు. అనంత‌రం తెలుగుదేశం పార్టీలో చేరి పూర్తిస్థాయి రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లోకి దిగారు. 
 
2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ టికెట్‌పై కొడంగ‌ల్ నుంచి పోటీ చేశారు. 2018 తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ముగ్గురు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ల‌లో ఒక‌రిగా ఆయ‌న నియ‌మితుల‌య్యారు. 2017 రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2015 ఒక స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కుకునిపోయారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి ఓటు వేయాల్సిందిగా ఆంగ్లో-ఇండియ‌న్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌స‌న్‌కు డ‌బ్బులివ్వ‌జూపార‌న్న‌ది రేవంత్ రెడ్డిపై ఉన్న ఆరోపణ‌. 
 
జూన్ 30 నాడు తెలంగాణ హైకోర్టు ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిలును మంజూరు చేసింది. 2014 కొడంగ‌ల్ నుంచి మ‌రోమారు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గురునాథ్ రెడ్డిపై గెలిచి రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2009 ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న గెలుపొందారు. 
 
ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గురునాథ్ రెడ్డిని ఓడించారు. 2008 రేవంత్ రెడ్డి టీడీపీలో మ‌రోసారి చేరారు. 2008 శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. 2006 జెడ్‌టీపీసీ ఎన్నిక‌ల్లో మేడ్చల్ స్థానం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి నెగ్గారు. 2004 ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరారు. 1992 విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్‌లో స‌భ్యుడయ్యారు.