Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ ఆదిలక్ష్మిని అష్టోత్తర శతనామస్తోత్రంతో స్తుతించండి

Advertiesment
శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామస్తోత్రం
FILE
శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామస్తోత్రం

1. శ్రీకాంతా శివసంధ్రాత్రీ శ్రీంకార పంజర శుకీ
శ్రీ పదాశ్రిత మందారా శ్రీకరీ భృ-గునందినీ

2. జితకోటి రతి సౌందర్యా జీవనరాగహేతవే
జీవనా జీవికా జీవా జీవనాచ జిజీవిషా

3. సుఖమూలా సుప్రియాచ సురాసుర సుసేవితా
అష్టలక్ష్మీ స్వరూపా చ ఆదిమూర్తి అనాహతా

4. అజితా విజితా సర్వజిద్దాసీభూత సురాంగనా
విష్ణుపత్ని ర్విశ్వరాజ్ఞీ ర్వేద వేదాంత చారిణీ

5. వేదమాతా విశ్వమాతా అనంతానంద ప్రదాయినీ
నిత్య ప్రకాశ స్వప్రకాశ స్వరూపిణీ నమో నమః

6. హృల్లేఖా పరమా శక్తి : మాతృకా బీజరూపిణీ
యజ్ఞ విద్యా మహవిద్యా గుహ్య విద్యా, విభావరీ

7. జ్యోతీష్మతీ మహామాతా సర్వమంత్ర ఫలప్రదా
గాయత్రీ సోమ సంభూతా సావిత్రీ ప్రణవాత్మికా

8. శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవ నమస్కృతా
జయా జయకరీ విజయా జయంతీ చారాజితా

9. అష్టాంగ యోగినీదేవీ నిర్భీజా ధ్యానగోచరీ
సర్వతీర్థ స్థితా శుద్ధా సర్వ పర్వత వాసినీ

10. శివాధాత్రీ శుభానందా యజ్ఞ కర్మ స్వరూపిణీ
ప్రతినీ మేనకా దేవీ బ్రాహ్మాణీ బ్రహ్మచారిణీ

11. ఏకాక్షర పరా తారా భవబంధ వినాశిని
విశ్వంభరధరాధరా నిరాధారాధిక స్వరా

12. రాకాకూహూ రమా వాస్య పూర్ణిమానుమతీద్యుతిః
సినీవాలీ శివానీ చవ శ్యా వైశ్వదేవీ పిశంగిలా

13. పిప్పలాచ విశాలక్షీ రక్షోఘ్నీ వృష్టి కారిణీ
దుష్ట విద్రావిణీదేవి సర్వోప ద్రవనాశినీ

14. శారదా శర సంధాతా సర్వశస్త్ర స్వరూపిణీ
పంచవక్రాః దశభుజా శుద్ధ స్ఫటిక సన్నిభా

15. రక్తా కృష్ణా సితా పీతా సర్వవర్ణ నిరీశ్వరీ
పాతుమాం సర్వదాదేవీ
ఆదిలక్ష్మీ
నమో నమః

Share this Story:

Follow Webdunia telugu