Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోడ మీద పిల్లి.. ఇక అఖిలప్రియ జగన్ గూటికి?

Advertiesment
Bhuma Akhila Priya
, శుక్రవారం, 14 జూన్ 2019 (18:25 IST)
భూమా అఖిల ప్రియను గోడ మీద పిల్లి అని పిలుస్తున్నారు చాలామంది. ఎందుకంటే వైకాపా అధికారంలో లేనప్పుడు టీడీపీకి జంప్ అయ్యింది. ప్రస్తుతం టీడీపీకి అధికారం ఊడిపోవడంతో భూమా అఖిలప్రియ మళ్లీ వైకాపా గూటికే చేరుకోబోతుందని తాజా సమాచారం.


ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో వైకాపా ఓటమి పాలైనా.. ఈసారి భారీ మెజారిటీ జగన్ సర్కారు కొలువు దీరింది.
 
2014లో వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. అయితే అందులో భూమా అఖిల ప్రియ కూడా ఒకరు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళిన ఈమెకు టీడీపీలో మంత్రి పదవి కూడా లభించింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికలలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని టీడీపీ తరపున పోటీ చేయించి గెలిపించుకున్నారు. 
 
అయితే ఈ సారి జరిగిన ఎన్నికలలో మాత్రం వీరిద్దరు ఓడిపోయారు. ఇక టీడీపీకి కూడా అధికారం లేకపోవడంతో.. ఇక వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు అఖిల. ఇందుకోసం తెరవెనుక మంతనాలు కూడా సాగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే వీరి కుటుంబంతో ఎప్పటి నుంచో సాన్నిహిత్యంగా ఉన్న వైఎస్ విజయమ్మ ద్వారా వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భూమా అఖిలప్రియ ఆలోచిస్తున్నారట. 
webdunia
 
అయితే తాను టీడీపీలో ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్ప్పుడు కానీ జగన్‌పై ఎలాంటి ఆరోపనలు చేయలేదని కూడా చెప్పారట. దీంతో మళ్ళీ భూమా కుటుంబం వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అందుకు జగన్ కూడా సానుకూలంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం జగన్‌ నిర్ణయంతో కేసీఆర్ దిక్కులు చూస్తున్నారు... రాములమ్మ