నేడు ఫిబ్రవరి 29వ తేదీ.. ప్రస్థానం..
ప్రతీ ఫిబ్రవరికీ 28 రోజులే....
కానీ 4 సంవత్సరాల కోసారి ఎక్స్‌ట్రా డే ఎందుకు?
అదీ ఫిబ్రవరిలోనే ఎందుకు?
ప్రతీ నాలుగేళ్లకోసారి మనకు లీప్ ఇయర్ వస్తుంది. లీప్ ఇయర్ లో.. ఈ అదనపు రోజు ఎందుకు కలుస్తోంది? ఇందుకు సైంటిఫిక్ కారణాలున్నాయి. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి. అదే లీప్ ఇయర్ వస్తే... ఫిబ్రవరిలో 29వ తేదీ కూడా ఉంటుంది. ఫిబ్రవరిలో 29వ తేదీ ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంట.
ఏడాది ఆయుష్షులో.... అదనంగా మరోరోజు జీవించినట్లే. అసలు ఈ ఎక్స్‌ట్రా డే ఎందుకుంటుందో తెలుసుకుందాం. మనకు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని. ఇలా ఓ రౌండ్ తిరిగేందుకు 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుందని మనకు తెలుసు. అంటే సంత్సరానికి 365 రోజులకు తోడు మరో పావు రోజు పడుతుంది.
ఆ పావు రోజును ఒక రోజుగా తీసుకోలేం కాబట్టి... ప్రతీ నాలుగేళ్లలో నాలుగు పావు రోజుల్ని కలిపి... ఒక రోజుగా మార్చి... లీప్ ఇయర్‌లో ఫిబ్రవరి నెలలో అదనపు రోజును చేర్చుతున్నారు. ఫిబ్రవరిలోనే అదనపు రోజు ఎందుకు కలుపుతున్నారు? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఫిబ్రవరిలో 28 రోజులే ఉన్నాయి కాబట్టి కలుపుతున్నారని అనుకోవచ్చు.
కానీ... ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకున్నాయన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఉంది. క్రీస్తు పూర్వం గ్రీస్, రోమన్‌లు... కేలండర్‌లో రోజుల్నీ, నెలలనూ ఇష్టమొచ్చినట్లు మార్చేసేవాళ్లు. ఉదాహరణకు రోమ్ చక్రవర్తిగా జూలియస్ కాసర్ బాధ్యతలు స్వీకరించేటప్పటికి రోమన్ క్యాలెండర్‌లో ఏడాదికి 355 రోజులే ఉండేవి. ప్రతీ రెండేళ్లకూ 22 రోజులు ఉన్న ఒక నెల అదనంగా చేరేది. ఆయన ఎంటరయ్యాక... కేలండర్‌లో చాలా మార్పులు చేశారు. తద్వారా 365 రోజుల కేలండర్ వచ్చింది.
అలాగే ప్రతీ నాలుగేళ్లకూ అదనపు రోజును ఆగస్టు నెలలో కలిపారు. ఫలితంగా అప్పట్లో ఫిబ్రవరికి 30 రోజులు, జులైకి 31 రోజులు, ఆగస్టుకు 29 రోజులు వచ్చాయి. జూలియస్ కాసర్ తర్వాత కాసర్ ఆగస్టస్ చక్రవర్తి అయ్యాడు. ఆయన పుట్టింది ఆగస్టులో. తాను పుట్టిన నెలలో రోజులు తక్కువగా ఉండటాన్ని ఇష్టపడలేదు. ఆగస్టు నెలకు 2 రోజులు పెంచుకున్నాడు.
జూలియస్ కాసర్ ఫిబ్రవరిలో పుట్టాడు కాబట్టి ఈయన ఫిబ్రవరిలో ఆ రెండు రోజులూ తగ్గించాడు. ఫలితంగా ఆగస్టుకి 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులూ వచ్చాయి. అప్పటి నుంచీ లీపు సంవత్సరంలో 1 రోజును ఆగస్టుకి కాకుండా... ఫిబ్రవరికి కలపడం మొదలు పెట్టారు. ఇప్పట్లో ఈ కేలండర్‌ను మార్చే ఉద్దేశాలు ప్రపంచ దేశాలకు లేవు.
అందువల్ల ప్రతిసారీ లీప్ ఇయర్‌లో ఫిబ్రవరికి 1 రోజు యాడ్ అయి 29 రోజులు వస్తాయి. లీపు సంవత్సరం ఫిబ్రవకి 29 న పుట్టిన వారికి మిగిలినవారికి భిన్నంగా ప్రతీ 4 సంవత్సరాల కొకసారి పుట్టిన రోజు పండుగ రావడం గమనార్హం. అటువంటి పిల్లలకు మనం ప్రత్యేకంగా పుట్టినరోజు పండుగ జరపాలి.