Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పట్టెడన్నం కోసం వ్యభిచార గృహల్లో యువతుల బతుకులు ఛిద్రం!

ఒకవైపు.. పేదరికం... మరోవైపు కరవుకాటకాలు... దీంతో పట్టెడన్నం కోసం ఆకటితో అలమటిస్తున్నారు అనేక మంది పేద యువతులు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని దయనీయస్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నా

Advertiesment
పట్టెడన్నం కోసం వ్యభిచార గృహల్లో యువతుల బతుకులు ఛిద్రం!
, గురువారం, 19 జనవరి 2017 (12:16 IST)
ఒకవైపు.. పేదరికం... మరోవైపు కరవుకాటకాలు... దీంతో పట్టెడన్నం కోసం ఆకటితో అలమటిస్తున్నారు అనేక మంది పేద యువతులు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని దయనీయస్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకున్న కొందరు ఆ అభాగ్యులకు ఉద్యోగం పేరుతో మాటలు కలిపి, దూర ప్రదేశాలను తీసుకొచ్చి వ్యభిచార గృహలకు విక్రయిస్తున్నారు. 
 
ఇలా ఎంతో మంది అభాగ్యులు వ్యభిచార గృహల్లో నలిగిపోతూ వ్యభిచార నిర్వహకుల చేతిలో నుంచి బయట పడలేక ఎంతో మంది అమాయక యువతుల జీవితాలు గాలిలో దీపంలో మారిపోయాయి. చీకటిలో కామ రాక్షసులు శరీరాలకు చేసిన గాయాలతో నరక కూపంలో కూరుకుపోయి జీవితాంతం దుఃఖంతో కుమిలిపోతున్నారు. 
 
బళ్లారిలో వ్యభిచార గృహల నుంచి పోలీసుల పట్టుకొచ్చి కోర్టులో నిలబెడితే భాష రాక, అసలు ఏమి జరిగిందో తెలియక, తన అనేవాళ్లు లేక ఎవరితో బాధలు చెప్పలేక కన్నీరుతో రోధిస్తుంటే ఎంతటి కసాయి గుండె అయినా కన్నీరు రాలుతుంది. ఇలాంటి సంఘటనలో కూరుకుపోయిన పశ్చిమ బంగా, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అనేక మంది యువతులు ఉన్నారు. 
 
బళ్లారిలో బోలెడన్ని మైనపు గనులున్నా... చేసేందుకు పని లేక అనేక మంది వలస పోతున్నారు. మరికొంతమంది వ్యభిచార గృహలు నిర్వహిస్తున్నారు. మరికొందరు ఇతర ప్రదేశాలకు తరలిపోతున్నారు. అలా తరలివెళ్లిన యువతుల శరీరం స్థిరత్వం కోల్పొయి... ఒంట్లో శక్తి సన్నగిల్లి అనేక వ్యాధులకు లోనైన ఎంతో మంది నిస్సహాయస్థితిలో దిక్కులేక ఏ చెట్టచాటునో వాడిన ఆకులా రాలిపోతుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20న శ్వేతభవనాధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణం... తొలి రోజున ఏం చేస్తారంటే...