Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయాల్లోకొచ్చి పవన్ పెళ్లి చేసుకున్నాడు... మరి రజనీ పరిస్థితేమిటి..? సిల్క్ స్మితకు కబాలికి లింకేంటి?

ఇప్పటిదాకా అందరివాడిగా మన్ననలు పొందిన రజనీకాంత్ త్వరలో కొందరివాడిగా మారబోతున్నాడు. ఏ పార్టీతోనూ ఎక్కువగా కలవకుండా (డిఎంకెకు మద్దతివ్వడం తప్పని తానే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా), రాజకీయ ప్రవేశంపై ఎప్పటి

Advertiesment
రాజకీయాల్లోకొచ్చి పవన్ పెళ్లి చేసుకున్నాడు... మరి రజనీ పరిస్థితేమిటి..? సిల్క్ స్మితకు కబాలికి లింకేంటి?
, గురువారం, 18 మే 2017 (12:08 IST)
ఇప్పటిదాకా అందరివాడిగా మన్ననలు పొందిన రజనీకాంత్ త్వరలో కొందరివాడిగా మారబోతున్నాడు. ఏ పార్టీతోనూ ఎక్కువగా కలవకుండా (డిఎంకెకు మద్దతివ్వడం తప్పని తానే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా), రాజకీయ ప్రవేశంపై ఎప్పటికప్పుడు దాటవేస్తూ కాలం గడిపేసిన ఈ తమిళ సూపర్‌స్టార్ ఎట్టకేలకు ఈసారి ఓ అడుగు ముందుకేసేలా కనిపిస్తున్నారు. 
 
ఐతే ఈ ముందడుగుతో ఆయనకు అధికారయోగం పట్టినా, పట్టకున్నా వివాదాలు మాత్రం చుట్టుముట్టడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ పవర్‌స్టార్ పవన్‌ను చూపుతున్నారు. సత్యానంద్ వద్ద శిష్యరికం చేసే రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన పవన్, ఆ తర్వాత వేరుపడి రేణూదేశాయ్‌తో సహజీవనం చేసినా, తాళి కట్టకుండా పిల్లలను కన్నా ప్రజారాజ్యం ముందువరకు చెల్లిపోయింది. 
 
రాజకీయమంటూ మొదలెట్టాక, బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకుని తాళి కట్టేవరకు ప్రత్యర్థుల నోళ్లు మూతపడలేదు. ఇప్పుడు జనసేన అంటూ స్వంత అజెండా, జెండా పట్టుకున్నా రేణూదేశాయ్‌కి విడాకులిచ్చేసి జర్మనీ భామని పెళ్లాడినా, ప్రత్యర్థులు ఎప్పటికప్పుడు ఈ పెళ్లిళ్ల విషయంలో పవన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంటారు.
 
కొన్నాళ్ల క్రితం సిల్క్ స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించిన డర్టీపిక్చర్ తెరకెక్కుతున్న రోజుల నుండి ఆ సినిమాలో రజనీ పాత్రపై సందేహాలు, వివాదాలు తలెత్తాయి. ఆయన యంగ్ హీరోగా నటిస్తున్న రోజుల్లో కూడా ఆయన ప్రవర్తనపై చాలా అనుమానాలు ఉండేవని, కానీ అప్పటికి అన్నీ చెల్లిపోయాయని కోలీవుడ్ సీనియర్ నటులు ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యానిస్తూనే ఉంటారు. 
 
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చాలా సాధారణమైపోయిన ఈ రోజుల్లో ఆ పాత వివాదాలే రజనీకాంత్ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో కొత్త రూపు తీసుకుని రాజకీయ ప్రత్యర్థుల చేతిలో అస్త్రాలుగా మారితే, ఆ విమర్శల వేడికి రజనీ తట్టుకుని, ధీటుగా జవాబివ్వగలరా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరుద్యోగ భృతి పథకం అమలు.. నెలకు రూ.5వేలు.. ట్రైనింగ్ ప్లస్ ఉద్యోగం కూడా..?