పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇప్పుడు ఒక అగ్రనిర్మాతకు చిక్కులు తెచ్చెలా ఉన్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు ఆ నిర్మాతకు చిక్కులతో పాటుగా ఆర్థికంగా భారీ నష్టాలు తప్పేలా లేవని ఇప్పుడు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అటు రాజకీయంగా, ఇటు చిత్ర పరంగా అనేక సమస్యలు రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.
అసలు పవన్‌తో ఇబ్బందిపడేది ఏ నిర్మాత అనుకుంటున్నారా.. ఇంకెవరు అగ్ర నిర్మాత దిల్ రాజు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్‌ను సృష్టించుకున్న దిల్ రాజు ఇప్పుడు పవన్‌తో ఇబ్బంది పడక తప్పదనిపిస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఎపిలో ఇప్పుడు రాజకీయాలు హాట్‌హాట్‌గా జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తూ తాను ముందుండి నడిపించాల్సిన సమయం కూడా. అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం అటు రాజకీయాల్లో.. ఇటు సిని పరిశ్రమలో ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. ఇంతకాలం పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉండి కేవలం రాజకీయాలే చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చి పవన్‌ను ఈ సినిమాకు ఒప్పించారు దిల్ రాజు. అంతేకాదు పవన్‌పై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు కూడా ఆయన.
అయితే దిల్ రాజుకు ఇచ్చిన డేట్స్ ప్రకారం మొదటి రోజు షూటింగ్‌లో పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్. అయితే షూటింగ్ పూర్తి చేసుకుని వెంటనే హడావుడిగా విజయవాడ బయలుదేరారు. పగలంతా సినిమా షూటింగ్‌లో బిజిబిజిగా గడిపిన పవన్ కళ్యాణ్ సాయంత్రం కాగానే తిరిగి రాజకీయాల కోసం విజయవాడ వెళ్ళి పార్టీ శ్రేణులతో మీటింగ్ పెట్టారు. అయితే ఇప్పుడు రాజధాని విషయమై అసెంబ్లీలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న తరుణంలో అమరావతి ప్రజలకు బాసటగా నిలవాల్సిన తరుణంలో పవన్ సినిమా బాట పట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు చేయడం కుదిరే పనేనా పవన్‌కు అన్నది సందేహంగా మారింది. పగలు సినిమాలు చేస్తూ.. రాత్రి రాజకీయాలు చేస్తే ఏపీ ప్రజలకు న్యాయం జరుగుతుందా.. అసలు ఇలాంటి కీలక సమయంలో పవన్ రాజధాని ప్రజలకు అండగా ఉండకుండా సినిమాలు చేస్తే ఎలా.. ఒకవేళ రాజకీయాలు చేసే సమయంలో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే.. మరి సినిమా షూటింగ్ పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నలుగా మారుతున్నాయి.
ఒకవేళ రాజధాని కోసం పవన్ ఆందోళన చేస్తే అక్కడ సినిమా షూటింగ్ రద్దు అవుతుంది. దీంతో నిర్మాత దిల్ రాజుకు ఇబ్బంది తప్పదు.. కాదు సినిమానే ముఖ్యం అనుకుంటే ఇక్కడ రాజకీయాల్లో కనుమరుగుకాక తప్పదు. తాను జనసైనికుడిగా జనంతో లేకుంటే కష్టకాలంలో వారిని వదిలేసి వెళ్ళిపోతే ప్రజలకు అన్యాయం చేసినట్లే లెక్క అవుతుందన్నది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అటు రాజకీయాలు.... ఇటు సినిమాలు ఏకకాలంలో దాదాపు మూడు నెలల కాలం ఎలా మేనేజ్ చేయగలడో.. ఇటు దిల్ రాజును.. అటు ఏపీ ప్రజలను ఎలా మెప్పిస్తాడోనన్నది ఆసక్తికరంగా మారుతోంది.