Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమలనాథులను మోసం చేసిన శశికళ... కాంగ్రెస్‌కు తీసిపోని బీజేపీ!

తప్పో, ఒప్పో ఒక ప్లాన్‌ గీసేశారు. అందులో ఎవరి వాటా ఎంతో కూడా క్లియర్‌గా మాట్లాడుకున్నారు కూడా. కానీ ఇంతలో బుద్ధిమారిపోయింది. కాదు కూడదు అని అడ్డం తిరిగింది. అంతమాత్రాన అధికార పార్టీ అంత ఈజీగా వదిలేస్త

Advertiesment
కమలనాథులను మోసం చేసిన శశికళ... కాంగ్రెస్‌కు తీసిపోని బీజేపీ!
, శుక్రవారం, 23 డిశెంబరు 2016 (12:53 IST)
తప్పో, ఒప్పో ఒక ప్లాన్‌ గీసేశారు. అందులో ఎవరి వాటా ఎంతో కూడా క్లియర్‌గా మాట్లాడుకున్నారు కూడా. కానీ ఇంతలో బుద్ధిమారిపోయింది. కాదు కూడదు అని అడ్డం తిరిగింది. అంతమాత్రాన అధికార పార్టీ అంత ఈజీగా వదిలేస్తుందా? ఎవరికి అనుమానం రాకుండా సంధర్భానికి తగ్గట్టే వదిలిన బాణం భారీగానే గుచ్చుకోబోతోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఇది బిజెపికి కలిసొస్తే రెండు వైపులా ప్రమాదం ముంచుకొస్తుండడం చిన్నమ్మను చిక్కుల్లో పడేస్తోంది. జయలలిత మరణం వెనుక కుట్ర కోణం ఉందన్న వాదన బలపడుతోంది. దానికి వెనుక ఉండి నడిపించింది బిజెపి పెద్దలే అన్న సందేహాలు ఉన్నాయి.
 
కర్రవిరగకుండా పాము చావాలని చేసిన ప్లాన్‌‌లో కర్ర కాస్త విరిగినట్లయింది. అందుకే తమిళ రాజకీయం ఇంత గందరగోళంగా మారింది. జయలలిత పరిస్థితిని ముందే అంచనా వేసిన బిజెపి ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళనాడులో పార్టీని బలోపేతం చేసుకోవడం అసంభవం, దానికి తోడు ఎమ్మెల్యేలను లాక్కొని అధికారం తీసుకోవడానికి కూడా ఏ మాత్రం అవకాశాలూ లేవు.
 
దీంతో శశికళను బూచిగా చూపెట్టి తమిళనాడులో రాజకీయ మద్దతు కూడగట్టుకోవాలనుకుంది బిజెపి. తర్వాత చిన్నగా ఆ పార్టీలో గందరగోళం సృష్టించి తమలో కలుపుకోవాలన్న ఆశ కూడా కమలదళం వద్ద ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లుగానే జయను పంపించేశారు. అయితే ఒప్పందం ప్రకారం కాకుండా తాను జయకు ఏ మాత్రం తక్కువ కాదన్నట్లు శశికళ రింగ్‌లోకి వచ్చింది. ఇటు అధికారాన్ని అటు పార్టీని తానే నడిపించే విధంగా బలాన్ని కూడగట్టుకునే ప్రయత్నాల్లో బిజీ అయిపోయింది. దీంతో అసలుకే మోసం వస్తుందనుకున్న బిజెపి అస్త్రాలను ప్రయోగించింది. 
 
ఎలాగూ పెద్దనోట్ల రద్దు కారణంగా దేశంలో ఐటీ దాడులు మామూలు అయిపోయాయి. సందడిలో సడేమియాలో శశికళ చుట్టూ బలమైన ఉచ్చు బిగించడానికి కూడా ఆ ఐటీనే వాడుకున్నారు. దీంతో కట్టల పాములు బయటకు వస్తున్నారు. ఒకవైపు జయ మరణంపై అనుమానాలు తమిళ జనాల్లో ఎక్కువ అవుతున్నాయి. ఇంకో వైపు ఐటీ దాడులతో బిజెపి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. శశికళకు అసలు విషయం ఇప్పటికే అర్థమైనట్లు ఉంది. రేపో మాపో కాళ్ళ బేరానికి వచ్చి తనను తాను కాపాడుకుంటుందో లేక మెండిగా వెళ్ళి రెండు విధాలుగా చిక్కులు తెచ్చుకుంటుందో చూడాలి. మొత్తానికి ఇలాంటి చావు దెబ్బతీయడంలో కాంగ్రెస్‌ కంటే తామేమీ తక్కువ తినలేదని నిరూపించారు బీజేపీ వాళ్లు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మకు తగ్గిన క్రేజ్.. శశికళకు పెరిగిన క్రేజ్.. పోయెస్ గార్డెన్‌లో క్యూ.. అమ్మ సమాధి దగ్గర లేదు ఎందుకు?