Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ పార్టీతో కలవాలని చంద్రబాబుకు ఎందుకంత ఉబలాటం?

ఆ పార్టీతో కలవాలని చంద్రబాబుకు ఎందుకంత ఉబలాటం?
, శుక్రవారం, 24 జులై 2020 (20:27 IST)
అసలే ప్రతిపక్ష పార్టీ నేతలను ఎపిలో తిరగనీయకుండా చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రతిపక్ష పార్టీల నేతలందరూ పార్టీ నుంచి వెళ్ళిపోవడం.. కొంతమంది పార్టీలో ఉన్నా సైలెంట్‌గా ఉండిపోవడం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఆ పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు.
 
ఎపిలో వైసిపిని ఎదుర్కోవాలంటే సింగిల్‌గా తమ వల్ల కాదని.. జాతీయస్థాయిలో ఉన్న పార్టీ అయితేనే ఇది సాధ్యమవుతుందన్నది చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట. మొదట్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలుద్దామని అనుకున్నారు. కానీ ఆ పార్టీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు.
 
ఇక బిజెపితో కలుద్దామనుకుంటే ఎన్నికలకు ముందు ఆ పార్టీతోనే విభేదించి విడిపోయారు చంద్రబాబు. ఇది అందరికీ తెలిసిందే. చివరకు కేంద్రమంత్రుల పదవులను కూడా వదిలేసుకున్నారు. బిజెపితో స్నేహబంధం కాస్త చివరకు తీవ్ర విమర్సల వరకు వెళ్ళింది. ఇది కాస్త ఎన్నికలకు ముందు పెద్ద చర్చే జరిగింది.
 
ఆ తరువాత వైసిపి అధికారంలోకి రావడం.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పార్టీలోని వ్యక్తులను ఆ పార్టీని ఒక్కొక్కరుగా వదిలి వెళ్ళిపోవడం లాంటివి జరిగిపోయాయి. అసలే కష్టకాలంలో ఉన్న పరిస్థితుల్లో ఎలాగైనా సరే నిలదొక్కుకోవాలి.. పార్టీని వదిలి వెళ్ళిన వారిని తిరిగి రప్పించుకోవాలని చంద్రబాబు ఆలోచనలో పడ్డారట.
 
అందుకే భారతీయ జనతాపార్టీ ముఖ్య నేతలతో మళ్ళీ చంద్రబాబు మాట్లాడడం ప్రారంభించారట. మెల్లమెల్లగా తనకున్న పరిచయాలతో ముఖ్య నేతలను ఒప్పించి ఆ తరువాత మోడీకి విన్నవించి స్నేహబంధంతో రాజకీయాల్లో ముందుకు సాగాలన్నది చంద్రబాబు ఆలోచన.
 
కరోనా సమయం కాబట్టి ఇప్పుడు ఫోన్‌లోనే బిజెపి ముఖ్య నేతలతో మాట్లాడి... ఆ తరువాత నేరుగా బిజెపి నేతలను కలిసి ఈ ప్రతిపాదన పెట్టేందుకు సిద్ధమవుతున్నారట చంద్రబాబు. విషయం కాస్త ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు తెలిసిందట. అయితే ప్రస్తుతానికి బాబు ట్రయల్‌లోనే ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామన్న ధోరణితో కన్నా ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి చంద్రబాబు ప్రయత్నం ఫలిస్తుందో లేదోనన్నది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శత్రువులు క్షిపణులు పేల్చినా సహచర జవాన్ కోసం పాక్ భూభాగంలో దూకాడు...