Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించుకుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?

Advertiesment
ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించుకుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?
, గురువారం, 24 ఫిబ్రవరి 2022 (13:24 IST)
ఉక్రెయిన్ పైన రష్యా దూకుడుపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆగ్రహంతో వుంది. మరోవైపు ప్రపంచంలోని ఇతర దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇంకోవైపు రష్యా భూ బలగాలు గురువారం అనేక దిశల నుండి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాయని, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ దాడిని ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. వ్యవహారం చూస్తుంటే ఉక్రెయిన్ దేశాన్ని తన గుప్పెట్లోకి తీసుకునే దిశగా రష్యా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

 
రష్యా ట్యాంకులు, ఇతర భారీ ఆయుధ సామగ్రిని  ఉక్రెయిన్ ఉత్తర ప్రాంతాలలో, అలాగే క్రెమ్లిన్-అనుకూలమైన ద్వీపకల్పంలోని క్రిమియా నుండి సరిహద్దును దాటినట్లు ఉక్రెయిన్ సరిహద్దు గార్డు సర్వీస్ తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రారంభించారు. ఈ బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా వినిపించాయి. ఉక్రెయిన్ దేశంపైన పుతిన్ పూర్తి స్థాయి దండయాత్ర చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
 
webdunia
ఉక్రెయిన్ పైన సైనిక చర్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇతర పాశ్చాత్య నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ చర్యకు దిగిన పుతిన్ ప్రపంచం ముందు నిలబడక తప్పదని హెచ్చరించారు. మరోవైపు ఉక్రెయన్ అధ్యక్షుడు మాట్లాడుతూ... ఇది పుతిన్ దూకుడుకి పరాకాష్ట. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకుంటుంది, విజయం సాధిస్తుంది. ప్రపంచం పుతిన్‌ను ఆపగలదు, ఆపాలి. చర్య తీసుకోవలసిన సమయం ఇప్పుడు వచ్చింది అని అన్నారు.

 
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ మాట్లాడుతూ... ఉక్రెయిన్ పైన దాడిపై అంతర్జాతీయ సమాజం రష్యాను నిలదీయాలని పిలుపునిచ్చారు. అమాయక పౌరులను పొట్టనబెట్టుకునే ఈ మారణహోమం ఆపాలని విజ్ఞప్తి చేసారు. ఉక్రెయిన్‌పై దాడి చేయకుండా పుతిన్‌ను నిరోధించడానికి వారాలపాటు పాశ్చాత్య కూటమికి నాయకత్వం వహించాలని ప్రయత్నించిన బైడెన్ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
 
 
ఈ సందర్భంగా ఉక్రెయిన్ పైన రష్యా దాడి వల్ల సంభవించే మరణాలు, విధ్వంసానికి రష్యా మాత్రమే బాధ్యత వహిస్తుందనీ, యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలు, భాగస్వాములు ఐక్యంగా- నిర్ణయాత్మక మార్గంలో ప్రతిస్పందిస్తాయని తెలిపారు.

 
గురువారం బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ స్టేట్స్ జి7 నాయకుల వర్చువల్, క్లోజ్డ్-డోర్ అత్యవసర సమావేశం అవుతున్నాయి. ఈ సమావేశంలో రష్యాపై మరిన్ని ఆంక్షలను విధించే అవకాశం ఉంది. ఈ ఆంక్షలను రష్యా ఉల్లంఘిస్తే జి7 దేశాలు రష్యాపై దాడి చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేం. అలాంటిది జరిగితే మూడో ప్రపంచ యుద్ధం అనివార్యం అవుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25 సీఎం కేసీఆర్ హస్తిన పర్యటన - ఎందుకో తెలుసా?