Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాన్న ఉంటే భరోసా.. నాన్న ఉంటే ధైర్యం.. ఫాదర్స్‌డేను ఎప్పుడు జరుపుకుంటారు..?

Advertiesment
Father’s Day 2021
, శనివారం, 19 జూన్ 2021 (10:30 IST)
నాన్న ఉంటే భరోసా.. నాన్న ఉంటే ధైర్యం.. తాను క్రొవ్వొత్తిలా కరుగుతూ కుటుంబానికి వెలుగునిచ్ఛే వాడు నాన్న. చెప్పాలంటే రాళ్ళ దెబ్బలు తిని పళ్ళు ఇచ్ఛే చెట్టులాంటి వాడు నాన్న. వేలు పట్టి నడిపించేవాడు.. నాన్న వేలు కట్టి చదివించేవాడు నాన్న. పిల్లల మన విజయం కొరకు తపించేవాడు నాన్న.. ఆ విజయం సాధిస్తే.. మురిసిపోయేవాడు నాన్న. 
 
కష్టాల గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుడు నాన్న. నాన్న చేసిన త్యాగాలు, నాన్న గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే.. నాన్న అంటే భాద్యత.. నాన్న ప్రేమ గురించి ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువే.. అందుకే నాన్న కష్టాన్ని , ఇష్టాన్ని గుర్తించి నాన్న మనసు నొప్పించకుండా నాన్న చేయి పట్టుకుని నడుస్తున్న పిల్లలకు వందనం.
 
అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని మంచి మాత్రమే కనిపిస్తుంది. అదే నాన్నకు తప్పుఒప్పులు కనిపిస్తాయి. తప్పుని సరిచేయడానికి దండించడం కూడా తన బాధ్యతగానే తీసుకుంటాడు నాన్న.. ఆకలితీర్చటం అమ్మవంతు అయితే, పిల్లల ఆశలుతీర్చటం నాన్నవంతు. 
 
కనిపించే దేవత అమ్మ అయితే, కనపడని దేవుడు నాన్న. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది జూన్ నెల మూడో ఆదివారం ఫాదర్స్‌డే ని సెలెబ్రేట్ చేసుకుంటారు.. కానీ రోజూ నాన్న సేవలకు ప్రేమకు గుర్తింపు ఇవ్వాల్సిందే.. వెలకట్టలేని త్యాగాల నిధి నాన్నకు పితృదినోత్సవ శుభాకాంక్షలు.
 
పితృదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు (Sunday, 20 June, 2021) జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. 
 
ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్‌డే ను గుర్తించి జరుపుకున్నారు. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రెండు టీకాలతో వీర్యకణాలు తగ్గవు!