Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేపే యడ్డి సీఎంగా ప్రమాణం... కాంగ్రెస్-జెడీఎస్ ఎమ్మెల్యేలంతా బస్సుల్లో...

కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పుతో అక్కడి రాజకీయ పార్టీలు తలలు బాదుకుంటున్నాయి. రేపు భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఐతే ఆ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేల బలం తక్కువగా వున్నది. కానీ తమకు చాలినంత బలం వున్నదంటూ భాజ

రేపే యడ్డి సీఎంగా ప్రమాణం... కాంగ్రెస్-జెడీఎస్ ఎమ్మెల్యేలంతా బస్సుల్లో...
, బుధవారం, 16 మే 2018 (21:26 IST)
కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పుతో అక్కడి రాజకీయ పార్టీలు తలలు బాదుకుంటున్నాయి. రేపు భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఐతే ఆ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేల బలం తక్కువగా వున్నది. కానీ తమకు చాలినంత బలం వున్నదంటూ భాజపా చెపుతోంది. ఆ ప్రకారం చూస్తే వారు ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ లేదంటే జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ అయి వుండాలి. ఈ పార్టీల్లోని ఎమ్మెల్యేలు మద్దతు లేనిదే భాజపా సర్కారు ఎట్టి పరిస్థితుల్లో బల పరీక్షలో నెగ్గడం కల్ల. 
 
రేపు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ పార్టీల అధినేతలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందు సన్నద్ధమయ్యారు. 104 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు తమవైపే ఉన్నారని యడ్యూరప్ప చెపుతుండటంతో ఇక లాభంలేదని కాంగ్రెస్, జేడీఎస్ తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
 
మరోవైపు తమకు 117 ఎమ్మెల్యేల మద్దతు ఉందని తమకే అవకాశం ఇవ్వాలని జేడీఎస్‌-కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌కు లేఖ సమర్పించినా గవర్నర్ వారి లేఖను పరిగణించలేదు. యడ్యూరప్పను ఆహ్వానించడంతో ఆయన రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. మొత్తమ్మీద కర్నాటక రాజకీయాలు రసకందాయంగా మారాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిస్తా హౌస్‌తో జియో భాగస్యామ్యం.. జియో ఫోన్ కొనుగోలుపై హలీం డిస్కౌంట్ కూపన్లు