Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ మంత్రి బొజ్జల ఎందుకు మారిపోయారు...?

మంత్రివర్గ విస్తరణ తర్వాత మొదటగా అధినేతపై తిరుగుబావుటా ఎగురవేసి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. అప్పట్లో బొజ్జల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు వెంటనే మ

మాజీ మంత్రి బొజ్జల ఎందుకు మారిపోయారు...?
, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (11:54 IST)
మంత్రివర్గ విస్తరణ తర్వాత మొదటగా అధినేతపై తిరుగుబావుటా ఎగురవేసి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. అప్పట్లో బొజ్జల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు వెంటనే మంత్రి గంటా శ్రీనివాసరావు, సిఎం రమేష్‌‌లను బుజ్జగించేందుకు పంపారు. అయితే వారిద్దరినీ బొజ్జల సతీమణి చెడామడా తిట్టి పంపేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్యే పదవికే కాదు.. అవసరమైతే పార్టీకే రాజీనామా చేస్తామని బొజ్జల తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక వెనుతిరిగారు గంటా, సిఎం.రమేష్‌లు. అయితే ఉన్నట్లుండి బొజ్జల ఎందుకు మారిపోయారో ఇప్పటికీ ఎవరికి అర్థం కావడం లేదు.
 
కొత్త మంత్రుల కోసం ఉన్న మంత్రులను, అందులోనూ పనిచేయని మంత్రులను చంద్రబాబు తొలగించారు. చాలామంది నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సైలెంట్‌గా ఉండిపోతే బొజ్జల మాత్రం చూస్తూ కూర్చోలేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తున్నట్లు రాజీనామా లేఖన కూడా వెంటనే మెయిల్ చేశాడు. కేబినెట్ ప్రమాణ స్వీకారానికి కొద్ది సేపటికి ముందే ఈ నిర్ణయం బొజ్జల తీసుకోవడంతో పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
అయితే ఆ తర్వాత కొన్నిరోజుల పాటు తన సొంత నియోజకవర్గ ప్రజలకు ముఖం కూడా చూపించలేని స్థితిలోకి వెళ్ళిపోయిన బొజ్జల హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. చివరకు గత నాలుగురోజుల క్రితం శ్రీకాళహస్తికి వచ్చిన బొజ్జల తన అనుచరులు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది బొజ్జలకు. 
 
మంత్రి పదవి లేకున్నా కనీసం ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ధి అనేది దానంతట అనేది జరుగుతుందని, పదవే లేకుంటే ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో కాస్త మెత్తబడ్డ బొజ్జల చివరకు వెనక్కి తగ్గి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. అనుచరుల ఒత్తిడే బొజ్జల ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దినకరన్‌కు డెడ్‌లైన్.. 18లోపు తప్పుకోవాలి.. లేదంటే బహిష్కరణే.. అత్త వద్దకు అల్లుడు పరుగులు