Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బండ్ల గణేష్ సంచలన నిర్ణయం.. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటో?

బండ్ల గణేష్ సంచలన నిర్ణయం.. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటో?
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:56 IST)
రాజకీయాలు... సినిమా రెండూ వేరు వేరు.. సినిమాలలో అత్యున్నత స్థాయిలకు వెళ్లిన వాళ్లు కూడా రాజకీయాలలో ఇమడలేక ఫ్లాప్ అయిపోతూంటారు.. ఇక చిరంజీవి లాంటి వారైతే రాజకీయాల్లో ఇమడలేక అస్త్రసన్యాసం చేసేసి రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు అలా ప్రచారానికి వచ్చి ఇలా భయపడి వెనక్కి వెళ్లిపోతున్నారు. 
 
సినిమాల్లో వెలుగు వెలిగి.. రాజకీయాల్లోనూ వెలగిపోదామని ముందుకొచ్చిన ఎందరో నిరాశతో వెనుదిరగడం చూస్తూనే ఉన్నాము... తాజాగా మరో సినీ ప్రముఖుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పేసాడు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్.. సీటు దక్కకపోవడంతో హతాశుడయ్యాడు. తరువాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి హోదాలో... తెలంగాణ రాష్ట్రసమితి - కేసీఆర్ పాలనపై సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గొంతు కోసుకుంటానన్న ఈయన డైలాగ్ అప్పట్లో వైరల్ గా మారింది. 
 
అయితే ఎవ్వరూ ఊహించని విధంగా... బండ్ల గణేష్ అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసేసుకున్నాడు. రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆయన... ‘నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల  నుండి నిష్ర్కమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుండి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు వ్యాఖ్యల పట్ల బాధపడ్డ వారందరినీ పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను’ అంటూ బాధతాప్త హృదయంతో ట్వీట్ చేయడం రాజకీయంగా సినిమాలోకంలో సంచలనంగా మారింది.
 
కాగా... బండ్ల గణేష్ రాజకీయాల నుంచి వైదొలగడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఆయన ట్వీట్‌కు కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాజకీయ బురద నుండి బయటపడ్డావని కొందరంటూంటే.. రాజకీయం అనేది పచ్చబొట్టు లాంటిది.. అది నిన్ను వదలదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి... ఆయన రాజకీయాలే వదిలేసారో లేక పార్టీని మాత్రమే వదిలారో వేచి చూడాల్సిందే... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెడ్‌మీ నోట్7కు పోటీగా.. శామ్‌సంగ్ నుండి గెలాక్సీ ఎ20