Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూవింగ్ బసులో చంటిబిడ్డ తల్లిపై అత్యాచారం.. బస్సు రెండో డ్రైవరే నిందితుడు... ఎక్కడ?

victim

వరుణ్

, బుధవారం, 31 జులై 2024 (09:59 IST)
కదులుతున్న ప్రైవేట్ బస్సుతో చంటిబిడ్డతో కలిసి నిద్రపోతున్న మహిళపై అత్యాచారం జరిగింది. ఆ మహిళ నోట్లో గుడ్డలు కుక్తి.. ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ బస్సుకు ఉండే అదనపు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా ఘటనను తలపించే ఈ దారుణం హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 35 ప్రయాణికులతో సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లా పామూరుకు బయలుదేరింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు సిద్ధయ్య, కృష్ణ (40) ఉన్నారు. నిర్మల్ నుంచి వాహనాన్ని సిద్ధయ్య డ్రైవర్‌ సీటులో ఉన్నాడు. అక్కడ తొమ్మిదేళ్ల కూతురుతో కలిసి 27 ఏళ్ల మహిళ బస్సెక్కింది. అప్పుడే ఆమెపై అదనపు డ్రైవర్ కృష్ణ కన్నేశాడు. ఆమె తనకు మాత్రమే టికెట్ తీసుకోవడం, కూతురుకు తీసుకోక పోవడాన్ని గమనించి మాటల్లో పెట్టాడు. మధ్య సీట్లలో కాకుండా బస్సు చివరి సీట్లోకి వెళ్లి కూర్చుంటే పాపను పడుకోబెట్టడానికి ఇబ్బంది ఉండదంటూ సలహా ఇచ్చాడు. 
 
అతడు చెప్పినట్లే పాపతో కలిసి ఆమె చివరి సీట్లోకి వెళ్లి పడుకుంది. అర్థరాత్రి 12:15 గంటలకు బస్సు హైదరాబాద్ సమీపంలోకి చేరుకుంది. బస్సులో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. ఆ సమయంలో అదనపు డ్రైవర్ కృష్ణ, వెనుక సీట్లోకి వెళ్లాడు. అక్కడ బాలికతో కలిసి నిద్రస్తున్న మహిళపై అత్యాచారానికి యత్నించాడు. నిద్రలోంచి లేచిన ఆమె. షాక్‌లోంచి తేరుకునేలోపే నోట్లో బెడ్ షీట్‌ను కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు బస్సు నడుపుతున్న సిద్ధయ్య వద్ద కొచ్చి పక్కసీట్లో కూర్చున్నాడు. కొద్దిసేపటికి దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న బాధితురాలు.. తన పట్ల జరిగిన ఘోరాన్ని చెప్పుకొని, వారి సాయంతో డయల్-100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ఆ బస్సును చేజ్ చేసి తార్నాక మెట్రో స్టేషన్ వద్ద పట్టుకున్నారు. 
 
అప్పటికే నిందితుడు కృష్ణ మెట్టుగూడ చౌరాస్తాలో బస్సులో నుంచి దూకి పారిపోయాడని ప్రయాణికులు చెప్పారు. బస్సు నడుపుతున్న సిద్ధయ్యను అదుపులోకి తీసుకుని బస్సును సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కృష్ణను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం అతడిని మంగళవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శవాల దిబ్బగా మారిన వయనాడ్‌.. అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య!!